మైలేజ్ కోసం తాపత్రాయపడటంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరెవ్వరూ సాటిలేరనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా...తనను ఎవరూ ప్రస్తావించినా...పలకరించకపోయినా...తనదైన శైలిలో డబ్బా కొట్టుకుంటూ పోతుంటారనే సంగతి చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపానని - అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశానని, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈవోను చేశానని, పీవీ సింధు ప్రతిభకు తన ప్రోత్సాహమే కారణమని...ఇలా ఎన్నో చెప్పుకున్న చంద్రబాబు తాజాగా తనకు బ్రిటీషర్లు భయపడుతున్నారని ప్రకటించేశారు. . ‘ప్రత్యేక హోదా - ఇతర హామీలతో పాటు ఏపీ పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా ఆయనీ కామెంట్లు చేశారు. తన దూకుడుతో తెల్లోళ్లలో భయం మొదలైంన్నారు.
ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలులో కేంద్రం వ్యవహారశైలి బ్రిటీష్ పాలకులను తలపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. `కృష్ణా-గుంటూరు జిల్లాల్లో లభ్యమైన మన కోహినూర్’ వజ్రాన్ని బ్రిటీష్ పాలకులు ఎత్తుకెళ్లినట్టే కేంద్రం మనం కట్టే పన్నులు తీసుకుంటూ హక్కులు కాలరాస్తోందని ధ్వజమెత్తారు. నష్టపోయినప్పుడు అడిగే బాధ్యత మాకు ఉండదా?` అని పేర్కొంటూ ఇక్కడితో ఆగకుండా...`` విదేశీ పర్యటనల్లో భాగంగా బ్రిటిషర్ల మ్యూజియంకు పోతే వాళ్లు భయపడుతున్నారు. కోహినూర్ వజ్రాన్ని నేను అడుగుతానని వాళ్లు చాలా భయపడ్డారు. అమరావతికి సంబంధించినవి కూడా చాలాపెట్టారు. నేను చూడ్డానికి పోతానంటే భయపడి, నన్ను అడ్డుకునే పరిస్థితికి వచ్చారు.`` అంటూ తనదైన టైప్‌లో స్టీరియో ప్లే చేశారు.
ఈ సందర్బంగా మరో చిత్రమైన వాదనను సైతం చంద్రబాబ చేయడం గమనార్హం. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప ప్రతి ఒక్కరూ విభజన హామీల కోసం నిలదీస్తున్నారని, తాను ఈ పోరాటంలో ముందున్నానని చంద్రబాబు అన్నారు. స్పెషల్ స్టేటస్ వద్దని తాను ఎక్కడా చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు బుకాయించారు తాను హోదా వద్దని ఎక్కడ చెప్పానో చూపించాలని పేర్కొంటూ హోదా కావాలని ఎప్పట్నుంచో నేను అడుగుతున్నాను కదా అంటూ తన మాటకు తానే ట్విస్ట్ ఇచ్చారు.