కాపు ఓట్లను పవన్..చంద్రబాబుకు అమ్మేస్తున్నాడు: జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆయన విరుచుకుపడ్డారు. కాపుల ఓట్లను పవన్.. కళ్యాణ్.. చంద్రబాబుకు అమ్మేస్తున్నాడని.. వ్యాఖ్యానించారు. ``కాపుల ఓట్లను గంపగుత్తగా.. చంద్రబాబుకు అమ్మేసేలా దత్తపుత్రుడి రాజకీయాలు కనిపిస్తున్నాయి.
వీళ్ల మాదిరిగా నాకు.. దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నాకు లేకపోవచ్చు`` అని జగన్ అన్నారు. అంతేకాదు.. వీళ్లకు లేనిది.. తనకు ఉన్నది.. ప్రజల దీవెనలు.. దేవుడి ఆశీస్సులు మాత్రమేనని వ్యాఖ్యానించారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ పర్యటించారు. 'వైఎస్సార్ కాపు నేస్తం'కి సంబంధించిన మూడో విడత నిధులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పకపోయినా కాపునేస్తం అందిస్తున్నామని జగన్ తెలిపారు.
అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. మూడేళ్లలో ఒక్కొక్కరికి రూ.45 వేలు చొప్పున జమ చేసినట్లు తెలిపారు. కాపునేస్తం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేస్తున్నామని పేర్కొన్నారు.
డీబీటీ ద్వారా రూ.16,256 కోట్లు అందించామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి పథకాలు అందజేస్తున్నామని.. క్రమం తప్పకుండా లబ్ధిదారుల ఖాతాల్లో ఏటా నిధులు జమవుతాయని వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ వస్తున్నామని..ఇప్పటివరకు 2.46 లక్షల మంది కాపులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. మాటల ద్వారా కాకుండా.. చేతల ద్వారా కాపులకు కాపు కాస్తామన్నది మన ప్రభుత్వం చేసి చూపించిందని వివరించారు. పనిలో పనిగా రాజకీయ విమర్శలు చేశారు.