జ‌గ‌న్ రాజీనామా ప్ర‌క‌ట‌న‌.. ఏం జ‌రిగిందంటే!

Update: 2022-03-07 16:17 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న నోటి నుంచి రాని.. మాట‌ను అనేశారు. అదే.. త‌న ప‌ద‌వికి రాజీ నామా చేసేస్తాన‌ని.. ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. త‌నకు సీఎం ప‌ద‌వి తృణ‌ప్రాయ‌మ‌ని కూడా వ్యాఖ్యానించారు. త‌క్ష‌ణం తాను రాజీనామా చేసేందుకు రెడీ అని జ‌గ‌న్ చెప్పారు. ఇంత‌కీ ఏం జ‌రిగింది?  జ‌గ‌న్ ఎందుకు అంత సీరియ‌స్ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు..అనే విష‌యాలు చూస్తే..

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈ రోజు ప్రారంభమ‌య్యాయి. అయితే.. తొలి రోజే.. స‌భ‌ల తీవ్ర ర‌భ‌స చోటు చేసుకుంది. గవర్నర్ `గో బాక్` అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఒక్క‌సారిగా స‌భ‌లో ఏం జ‌రుగుతోందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఉద‌యం 8 గంట‌ల‌కే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా మొదలయ్యాయి.  సభ ప్రారంభంకాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలైంది. కాగా.. గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు.

రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఒక టీడీపీ ఎమ్మెల్యే.. గ‌వ‌ర్న‌ర్‌ను `ముస‌లి న‌క్క‌` అంటూ దూషించారు. అదేవిధంగా గవర్నర్ ప్రసంగ ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు.  

దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అదేస‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి సంబంధించిన ప్ర‌తుల‌ను చించేసి.. టీడీపీ స‌భ్యులు వాకౌట్ చేశారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.

క‌ట్ చేస్తే.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అయిపోయిన త‌ర్వాత‌.. శాస‌న స‌భ వ్య‌వ‌హారాల క‌మిటీ(బీఏసీ) మీటింగ్ జ‌రిగింది. దీనికి సీఎం జ‌గ‌న్‌, అసెంబ్లీ స్పీక‌ర్‌, మండ‌లి చైర్మ‌న్ కూడా హాజ‌ర‌య్యారు.అ దేవిధంగా ప్ర‌తిప‌క్షం నుంచి టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు.. హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌.. అచ్చెన్న‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ``స‌భ‌లో మీరు వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రిగా లేదు. గ‌వ‌ర్న‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం ఏంటి? క‌నీసం ఆయ‌న వ‌య‌సుకైనా మీరు గౌర‌వం ఇవ్వ‌రా?  బ‌డ్జెట్ ప‌త్రాలు చించేసి ఆయ‌న‌పై ఎగుర‌వేస్తారా?`` అని సీఎం తీవ్ర‌స్థాయిలో అచ్చెన్న‌పై ఫైర్ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా అచ్చెన్న జోక్యం చేసుకుని.. ``సార్‌.. మా హ‌యాంలో మీరు కూడా ఇలానే చేశారు. న‌ర‌సింహ‌న్ బ‌డ్జెట్ చ‌దువుతున్న‌ప్పుడు.. మీరు కూడా దూషించారు. మీరు కూడా బ‌డ్జెట్ ప‌త్రాలు చింపి పోశారు. ఇప్పుడు మేం చేశాం.. రెండూ స‌రిపోయాయి`` అని స‌మాధానం ఇవ్వ‌డంతో సీఎం జ‌గ‌న్ మ‌రింత ఫైర‌య్యారు. ``మేం ఇలా ఎప్పుడూ చేయ‌లేదు. ఒక‌వేళ మా స‌భ్యులు కానీ, నేను కానీ.. అలా గ‌వ‌ర్న‌ర్‌పై వ్య‌వ‌హ‌రించి ఉంటే.. నిరూపించండి.. నేను సీఎం ప‌ద‌వికి త‌క్ష‌ణ‌మే రాజీనామా చేసేస్తాను`` అని వ్యాఖ్యానించారు.

ఇదే విష‌యాన్ని ఇటు టీడీపీ నేత‌లు. అటు ప్ర‌భుత్వ ప‌క్షం చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి కూడా మీడియాకు చెప్పారు. మ‌రి.. ఇప్పుడు చంద్ర‌బాబుకు గొప్ప అవ‌కాశం వ‌చ్చిన‌ట్టేనని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News