టీడీపీ స్పీక్స్ : జ‌గ‌న్ మాట్లాడ‌రు ? మాట్లాడిస్తారు !

Update: 2022-05-21 02:30 GMT
? మాట్లాడ‌రు  : జ‌గ‌న్ చాలా సంద‌ర్భాల్లో మాట్లాడ‌రు. ! మాట్లాడిస్తారు : జ‌గన్ చాలా సంద‌ర్భాల్లో మాట్లాడిస్తారు. ఆ విధంగా ఆయ‌న రాజ‌కీయం న‌డిపిస్తుంటారు. 3 అంటే 3 సంద‌ర్భాల్లో జ‌గ‌న్ ఏ విధంగా అత్యంత చాక‌చ‌క్యంగా త‌ప్పించుకున్నారో చెప్పే క‌థ‌నం ఇది ! వీటిలో సోష‌ల్ మీడియా చర్చ‌కు వ‌చ్చిన విష‌యాలు చేరుస్తూ రాస్తున్న క‌థ‌నం ఇది.

మొద‌టి విష‌యం :

కేంద్రానికీ రాష్ట్రాల‌కూ మ‌ధ్య పెద్ద అగాధ‌మే ఉంది. దానిని పూడ్చేందుకు ఒక్క‌టంటే ఒక్క సానుకూల చ‌ర్య కూడా అటు రాష్ట్ర ప్ర‌భుత్వం కానీ ఇటు కేంద్ర ప్ర‌భుత్వం కానీ స్పందిస్తున్న దాఖ‌లాలే లేవు. ఇదే విష‌యాన్ని తెలివిగా కేసీఆర్ తో చెప్పించారు. వాస్త‌వానికి  న‌రేగా నిధులు కానీ మ‌రొక‌టి కానీ కేంద్రానికి చెప్పాపెట్ట‌కుండా మ‌ళ్లించి వివిధ అవ‌స‌రాల‌కు అనుగుణంగా వాడుకున్న దాఖలాలు ఉన్నాయి.

గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కారు కానీ ఇప్పుడున్న జ‌గ‌న్ స‌ర్కారు కానీ చేస్తున్న‌దిదే ! ఇదే సంద‌ర్భంలో బంగారు తెలంగాణ మాది అని ఘ‌నంగా ప్ర‌క‌టించే కేసీఆర్ కూడా ఇదే విధంగా న‌డుచుకుంటున్నారు. క‌నుక వీటిపై ఆయ‌న మాట్లాడ‌కుండా కేసీఆర్ తో మాట్లాడించి తెలివిగా ఇవాళ (అనగా గురువారం అన‌గా మే 19,2022 ) సాక్షిలో మొద‌టి పేజీలో కేసీఆర్ స్టేట్మెంట్ ప్ర‌చురింప‌జేశారు.. అంటే కేంద్రంతో నేరు క‌య్యం క‌న్నా ఈ విధంగా అయితే బాగుంటుంది అన్న‌ది ఆయ‌న యోచన కావొచ్చు.

రెండో విష‌యం :

ఆర్.కృష్ణ‌య్య ను రాజ్య‌స‌భ‌కు పంపే విష‌య‌మై లాస్ట్ మినిట్ వ‌ర‌కూ ఎటూ తేల్చ‌కుండా ఉంచారు జ‌గ‌న్. పైకి మాత్రం త‌మపై మీడియా స్పెక్యులేష‌న్స్ అన్న‌వి పెరిగి పోతున్నాయ‌ని చెబుతున్నా, ఇది కూడా ఉద్దేశ పూర్వ‌కంగా చేసిందే అన్న‌ది టీడీపీ చెబుతున్న ఆరోప‌ణ. వివ‌ర‌ణ కూడా ! ఎందుకంటే మొద‌ట్నుంచి రాజ్య‌స‌భ  గొడ‌వ అన్న‌ది పైకి తేల‌ని విష‌యంగానే ఉంది.ఆఖ‌రి నిమిషంలో పేర్ల మార్పు కూడా ఇలాంటిదే ! వాస్త‌వానికి త‌మ‌కు ఎటువంటి రాజ‌కీయ ఉద్దేశాలు లేవ‌ని, ఏ పార్టీ వైపూ మొగ్గు చూపేది లేద‌ని అదానీ గ్రూపుతో స్టేట్మెంట్ ఇప్పించింది కూడా జ‌గ‌న్ వ‌ర్గాలే అన్న‌ది కాద‌న‌లేని స‌త్యం అని  ఓ టాక్ ..సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న మాట. అంటే తెలివిగా గౌతమ్ అదానీతో ఓ స్టేట్మెంట్ ఇప్పించారే కానీ దీనిపై నేరుగా ఎక్క‌డా జ‌గ‌న్ మాట్లాడ‌లేదు. జ‌గ‌న్ వ‌ర్గాల‌యిన వారు కూడా మాట్లాడ‌లేదు. ఇది క‌దా తెలివి అంటే అని జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శిస్తున్న లౌక్యాన్ని చూసి అబ్బుర‌ప‌డుతోంది ప‌సుపు దండు.

మూడో విష‌యం :

సినీ నిర్మాత, న్యాయ‌వాది నిరంజ‌న్ రెడ్డి విష‌య‌మై కూడా జ‌గ‌న్ న‌డుచుకున్న‌ది ఇదే ! వాస్త‌వానికి తెలంగాణ‌లో కాస్తో కూస్తో పేరున్న సినీ వ‌ర్గాల్లో ఆయ‌నొక‌రు. మొన్న‌టి టికెట్ రేట్ల ర‌గ‌డ కూడా సాల్వ్ చేసింది ఏ చిరు కోస‌మో ఏ నాగ్ కోస‌మో కాదు అని కేవ‌లం సొంత మ‌నుషుల‌పై ఉన్న ప్రేమ‌తోనే త‌న లాయ‌ర్ నిర్మాత‌గా ఉంటూ తీసిన ఆచార్య కోసం, ఇంకా ఇత‌రేత‌ర ప్ర‌యోజ‌నాల కోసం ఆయ‌న త‌గ్గారు.

ఓ విధంగా ఇక్క‌డ కూడా నేరుగా జ‌గ‌న్ ఏమీ మాట్లాడ‌లేదు. పేర్ని నానితో అన‌గా అప్ప‌టి సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా అద‌న‌పు బాధ్య‌త‌లు మోసిన వ్య‌క్తితోనే చెప్పించారు. వాస్త‌వానికి జ‌గ‌న్ మీడియాకు ఎప్ప‌టి నుంచో సినిమా ప‌రిశ్ర‌మ‌పై విప‌రీతం అయిన ప్రేమ ఉంది. నిర్మాణ రంగంలోకి కూడా రావాల‌ని ఆకాంక్షించారు.  ఈ క్ర‌మంలో ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ ఫ్యామిలీ పేజీలు ఉంటాయి. ఇక్క‌డ కూడా జ‌గ‌న్ మాట్లాడ‌రు.. అక్క‌డి పేజీ నిర్వాహ‌కుల‌తోనే మాట్లాడిస్తారు. ఓ విధంగా రాజ‌కీయ, వ్యాపార, పారిశ్రామిక, సినిమా రంగాల‌కు సంబంధించి జ‌గ‌న్ కు మంచి ప‌ట్టు  ఉంది. ప‌రిచ‌యాలు ఉన్నాయి. అయితే వీటి గురించి నేరుగా స్పందించ‌రు. త‌న వాళ్ల‌తోనే తెలివిగా మాట్లాడిస్తారు. ద‌టీజ్ జ‌గ‌న్ !

ఇదీ ఇవాళ సోష‌ల్ మీడియా టాక్స్. ఇందులో  అన‌గా ఈ చ‌ర్చ‌ల్లో కొంత టీడీపీ కూడా పాల్గొంటుంది. కొంత‌లో కొంత జ‌న‌సేన కూడా త‌న వాయిస్ వినిపిస్తూ వ‌స్తోంది. ఏదేమ‌యినా జ‌గ‌న్  మాట్లాడ‌రు.. మాట్లాడిస్తారు.. ఇప్ప‌టికింతే !
Tags:    

Similar News