వీడ్కోలు సభ అంటే ఎలా ఉంటుంది. వెళ్లిపోయేది ఎవరైనా సరే.. వారు చేసిన పనుల్లో మంచి పనుల్ని వెతికి.. సదరు వ్యక్తి మంచితనాన్ని చేతనైనంత పొగిడేస్తుంటారు. ఇన్నాళ్లు పడ్డాం.. ఆఖర్లు చెడ్డగా మాట్లాడి చెడ్డపేరు తెచ్చుకోవటం ఎందుకన్న భావన కలుగుతుంది. కానీ.. అందుకు భిన్నంగా సదరు కీలక అధికారి ఘనత గురించి కాకుండా ఏపీ ఆర్థిక దుస్థితి గురించిన చర్చ వీడ్కోలు సభలో రావటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి ఏపీ సీఎస్ గా పని చేసిన ఆదిత్యనాథ్ దాస్ రిటైర్మెంట్ సభ జరిగి మూడు రోజులు కావొస్తుంది. కానీ.. ఆ సభలో మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు తెర తీయటమే కాదు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి ఆర్థిక వనరుల సమీకరణే కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సమీర్ శర్మకు పెద్ద సవాలుగా రిటైర్ అవుతున్న ఆదిత్యదాస్ కుండ బద్ధలు కొట్టేందుకు అసలు మొహమాట పడలేదు.
రిటైర్ అయ్యాక ఢిల్లీలో కొలువు ఇచ్చిన ప్రభుత్వం మీద అభిమానం ఉన్నప్పటికీ.. నిజాన్ని నిజంగా చెప్పేందుకు ఆయన వెనుకాడలేదన్న మాట వినిపిస్తోంది. ఢిల్లీలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన పనులన్ని నెరవేర్చే పని చేస్తానన్న ఆయన మాటల్లో ఆర్థిక కష్టాల మీద ఆయన మాట్లాడిన మాటల్ని అండర్ లైన్ చేసుకొని మరీ గుర్తు చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆదిత్యనాధ్ దాస్ సేవల్ని గుర్తు చేసుకున్న ఇద్దరు అధికారులు చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా సీఎస్ పరిగణలోకి తీసుకొని పరిష్కరించేవారంటూనే.. సచివాలయంలోని చాలామంది మంత్రులు.. ఉన్నతాధికారుల ఛాంబర్లలో ఏసీలు పని చేయటం లేదన్నారు. దీనికికారణం ఆర్థిక శాఖ అంటూ వేసిన సెటైర్ తీవ్రంగా తగిలినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని ఆదిత్యనాధ్ తో పాటు.. ఇతరులు కూడా చెప్పేయటం ఒక ఎత్తు అయితే.. చిన్న పనులు కూడా జరగకుండా ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఎస్ఎస్ రావత్ ఉన్నట్లు చెబుతున్నా.. అదంతా ఆయనకు వేసిన పంచ్ గా చెబుతున్నారు. మొత్తంగా.. ఆదిత్యనాధ్ వీడ్కోలు సభ ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న విసయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అందరికి అర్థమయ్యేలా చేశారంటున్నారు.