తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు కొత్త కాదు, ఎంతో మంది నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే కొందరు సీఎం ల ఏలుబడిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అలా కనుక చూసుకుంటే రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘమైన సమ్మెగా ఎన్టీయార్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసినది పదిలంగా ఉంది. నాడు ఎన్టీయార్ రెండవ మారు అధికారంలోకి వచ్చారు. అన్నింటా ఆయనదే విజయం. దాంతో దూకుడు మీద ఉండేవారు.
ఆ టైమ్ లో అంటే 1986 జూలైలో పీయార్సీ ని అన్న గారి నాయకత్వాన టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ పీయార్సీ తమకు అంగీకారం కాదని ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఇంతకీ ఆ పీయార్సీ ఎందుకు నచ్చలేదు అంటే దాన్ని అదే ఏడాది జనవరి నుంచి అమలు చేయకుండా ఆరు నెలలు వదిలేశారు. ఇక బేసిక్ పే విషయంలో చూసుకుంటే 740 రూపాయల నుంచి 750 రూపాయలు పెంచాలని ఉద్యోగులు కోరినా ఎన్టీయార్ ససేమిరా అన్నారు. ఇక అప్పటిదాకా ఇచ్చిన ఇంటీరియం రిలీఫ్ ని బేసిక్ పే లో కలపాలని కోరినా ప్రభుత్వం ఒప్పుకోలేదు.
దాంతో ఉద్యోగులు గర్జించారు. తమ డిమాండ్ల సాధనకు సమ్మె బాట పట్టారు. నాడు కూడా ఇప్పటిమాదిరిగానే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం చర్చల కోసం ఏర్పాటు చేసినా ఉద్యోగులు హాజరుకాలేదు. తమ డిమాండ్లు ఒప్పుకుంటనే సమ్మె నుంచి బయటకు వస్తామని స్పష్టం చేశారు. అలా 1986 నవంబర్ 5న ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు. అది నిరవధికంగా జరిగింది. ఎన్ని రోజులు అంటే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 53 రోజుల పాటు. ఈ రోజు దాకా చూస్తే సమ్మెలో అదే అతి పెద్ద రికార్డు.
ఒక ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో ఒక్కసారిగా ప్రభుత్వ పాలన స్థంభించిపోయింది. పాఠశాలలతో పాటు కార్యాలయాలు అన్నీ కూడా బంద్ అయ్యాయి. దాంతో ఎన్టీయార్ ఎక్కడా తగ్గేది లేదంటూ దూకుడు చూపించారు. ఆయన ఏకంగా పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ లో ఉద్యోగుల జీతాలకే 48 శాతం పైగా ఇస్తున్నామని చెప్పారు. ఇంకా పెంచితే ప్రభుత్వానికి అభివృద్ధికి నిధులు ఎక్కడివి అని కూడా ప్రశ్నించారు.
ఈ విధంగా సమ్మె సాగుతూండడంతో ఎన్టీయార్ కి కోపం వచ్చి ఒక దశలో జాతీయ భద్రతా చట్టం కింద ఉద్యోగ సంఘ నాయకులను అరెస్ట్ చేయించారు. దాంతో ఇంకా మరింతగా ఉద్యమం సాగింది. రాస్తారోకోలు, బందులతో ఏపీ అంతా నాడు అట్టుడికిపోయింది. అయినా ఎన్టీయార్ తగ్గలేదు. ఉద్యోగులను మొత్తం డిస్మిస్ చేస్తామని కూడా ఆవేశంతో ఊగిపోయారు.
ఉన్న వారిని తీసేసి కొత్త వారిని నియమించాలని నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. మరో వైపు మీరు ఏం చేసుకున్నా మేమూ తగ్గమని ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంతే రీతిన రియాక్షన్ ఇచ్చారు. ఇలా సమ్మె రెండు నెలలకు చేరువ అవుతున్న వేళ వామపక్ష ఎంపీగా ఉన్న సుకుమార్ సేన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగి అటు ఉద్యోగులకు ఇటు ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ విధంగా సమ్మె ఆగింది. అయితే ప్రభుత్వం ఉద్యోగులు కోరినట్లుగా మొత్తం డిమాండ్లకు తలవొగ్గి వారి చేత సమ్మెకు స్వస్తి వాచకం పలికించింది.
మొత్తానికి మొండివారుగా పేరున్న ఎన్టీయార్ కే చమటలు పట్టించిన ఘనత ప్రభుత్వ ఉద్యోగులకు ఉందని వారు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇది జరిగి నేటికి 36 ఏళ్లు కావస్తోంది. ఇపుడు చూస్తే అటూ ఇటూ తగ్గేది లేదు అంటున్నారు. మరి సమ్మె కనుక స్టార్ట్ అయితే ఎవరికి వారు బిగుసుకుపోవడం ఖాయం. అపుడు ప్రతిష్టలు, ఇగోస్ కూడా ముందుకు వస్తాయి. మరి పీట ముడి బిగియక ముందే సమ్మె జరగకుండా చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంతా సూచిస్తున్నారు.