ఏపీలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించిన ఉద్యోగులను నయానో.. భయానో.. దారికి తెచ్చుకునేందుకు ప్రబుత్వం చేపడుతున్న చర్యలు ఫలించడం లేదు. తాజాగా మరోసారి మంత్రుల బృందంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ముఖ్యంగా హెచ్చార్ ఏ విషయంలో వారు పట్టుబడుతుండగా.. ఇదే అంశంపై మంత్రులు మ్యాజిక్ చేస్తున్నారనే భావన ఉద్యోగుల్లో వినిపిస్తోంది. హెచ్‌ఆర్ ఏ పై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు ముందుంచింది. అయితే ఆయా ప్రతిపాదనలపై ఉద్యోగుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై కొత్త ప్రతిపాదనలను మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్‌తో 8 శాతం హెచ్‌ఆర్‌ఏ, 2 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్‌తో 9.5 శాతం, 10 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగ్‌తో 13.5 శాతం, 25 లక్షల్లోపు జనాభా ఉన్నా ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగ్‌తో 16 శాతం, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు రూ. 23 వేల సీలింగ్‌తో 24 శాతం ఇస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది.
మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో ఫిట్మెంట్పై మంత్రుల కమిటీ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్‌మెంట్ 23 శాతమే ఇస్తామని తేల్చి చెప్పింది. ఐఆర్ రికవరీ చేయబోమని మరోమారు స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సుముఖతను వ్యక్తం చేసింది.
మంత్రుల కమిటీ ఇచ్చిన హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లపై ఉద్యోగ సంఘాల అభ్యంతరం వ్యక్తం చేశాయి. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను కనీసం 12 శాతం నుంచి అమలు చేయాలన్నారు. కనీసం 12 శాతం హెచ్‌ఆర్‌ఏ నిర్ధారణ కష్టమని మంత్రుల కమిటీ తెలిపింది. మంత్రుల అభ్యర్ధనతో ఉద్యోగ సంఘాలు కొత్త ప్రతిపాదన తెచ్చాయి. 10, 12, 16 శాతం హెచ్‌ఆర్‌ఏ స్లాబులు నిర్ధరించాలని కోరాయి. ఉద్యోగ సంఘాల హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదనలపై మంత్రుల కమిటీ ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వివాదం సమసిపోయేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.