అదేంటో ఏపీలో కొత్త పీయార్సీ కాదు కానీ దాని చుట్టూ బోలెడన్ని ట్విస్టులు అల్లుకుపోతున్నాయి. నిన్నటిదాకా అయితే పీయార్సీ సాధన కమిటీ పేరు మీద ఒక నలుగురు నాయకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, వారు బస్తీమే సవాల్ అన్నారు. ప్రభుత్వంతో చాలెంజ్ చేశారు. తాము తలచుకుంటే ఎలాంటి ప్రభుత్వం అయినా కూలిపోతుంది అని కూడా చెప్పుకున్నారు.
వారే బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, కాకర్ల వెంకట రామిరెడ్డి, సూర్యనారాయణ. ఈ నలుగురు కేంద్రంగా మొత్తం ఏపీలో అతి పెద్ద ఉద్యమానికి రంగం సిద్ధం అయింది. చలో విజయవాడ ఆందోళనను కూడా వారే దగ్గరుండి నడిపించారు. ఇక సమ్మెకి సై అనుకున్న టైమ్ లో హఠాత్తుగా ప్రభుత్వంతో అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారు. ఆ మీదట అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు చేశారు.
దాంతో కధకు శుభం కార్డు పడింది అనుకుంటే అక్కడే అడ్డం తిరిగింది. మేము ఒప్పుకోం అంటూ ఉపాధ్యాయ సంఘాలు అడ్డం తిరిగాయి. మొదట ఏపీటీఎఫ్ పీయార్సీ స్టీరింగ్ కమిటీ నుంచి బయటకు వస్తే ఆ తరువాత యూటీఎఫ్ కూడా వచ్చేసింది. ఉపాధ్యాయ సంఘాలకు వామపక్షాల మద్దతుతో పాటు విపక్షాల మద్దతు కూడా క్రమంగా దక్కుతోంది. దాంతో ఇపుడు ఆ నలుగురు టాప్ లీడర్లలో వణుకు మొదలైంది అంటున్నారు.
పైగా ఉపాధ్యాయ సంఘాల నేతలు వారినే టార్గెట్ చేశారు. మీరు అమ్ముడు పోయారు అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో వారు పూర్తిగా కార్నర్ అవుతున్నారు. మరో వైపు చూసుకుంటే ప్రభుత్వంతో ఈ నలుగురూ కుదుర్చుకున్న ఒప్పందం మీద ఉద్యోగులు కూడా ఏ కోశానా సంతోషంగా లేరని వినిపించడం ఇపుడు హైలెట్ గా ఉంది. ఇన్నేసి గొప్ప కబుర్లు చెప్పి చివరికి ఏం సాధించారు అని సమ్మెను వద్దు అని ఎందుకు అనుకున్నారంటూ ఉద్యోగులు కూడా నిలదీస్తున్నారు.
ఇంకో వైపు చూస్తే ఆశుతోశ్ కమిటీ నివేదికను బయటపెట్టాలని, ఫిట్మెంట్ ని 27 శాతంగా అయినా పెంచుకుంటే తప్ప సమ్మె పిలుపు నుంచి వైదొలగమని చెప్పిన ఈ ఉద్యోగ సంఘాల నేతలు చివరికి ఏమీ కాకుండానే ఒప్పందాల మీద సంతకం చేయడం తో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా వీరి మీద గట్టిగానే ట్రోలింగ్ సాగుతోంది.
ఈ నేపధ్యంలో ఉద్యోగ సంఘాలలో ఉన్న అసంతృప్తి వేరే ఆలోచనలకు దారి తీస్తున్నట్లుగా చెబుతున్నారు. తమ ఉద్యమానికి, తమ ప్రయోజనాలకు ద్రోహం చేసిన ఈ ఉద్యోగ సంఘ నేతలను పదవుల నుంచి తప్పించేసి కొత్త జేఏసీ ఏర్పాటు దిశగా కూడా చర్చలు జోరుగా సాగుతున్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ పరిణామాలు కనుక జరిగితే ఆ నలుగురూ ఎవరూ లేని ఒంటరి వారు అయిపోతారు అని అంటున్నారు.
మొదట్లో అంతా బాగుంది అనుకున్నా అనూహ్యంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర స్వరం పెంచడం, తాము సమ్మెలోకి వెళ్తామని చెప్పడం, వారికి బయట కూడా బాగా మద్దతు దక్కడంతో ఆ నలుగురు ఉద్యోగ సంఘాల నేతలకు ఏమీ పాలుపోవడంలేదు అంటున్నారు.
అందుకే వారు సడెన్ గా సచివాలయంలో ఒక చోట చేరి సీరియస్ గానే డిస్కషన్ చేశారని అంటున్నారు. మరి చూడబోతే ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా వీరి పరిస్థితి ఉంది. దాంతో ఏం చేస్తారు అన్నది అయితే తెలియడంలేదు. ఏది ఏమైనా ఈ నలుగురు ఉద్యమ సింహాలూ టార్గెట్ అయ్యారన్నది నిజం. ఇపుడు ఏమి చేసినా చేతులు అయితే పూర్తిగా కాలిపోతున్నాయి అని అంటున్నారు.