నవ్యాంధ్రప్రదేశ్ పాలనలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీకి మూడు రాజధానులు అంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించి చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం రాజధానిగా కొనసాగుతున్న అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ గా కొనసాగిస్తూనే... కొత్తగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖలో - జ్యూడిషియల్ కేపిటల్ ను కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే ఓ స్థిర నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు కీలక పరిణామాల నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటు ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా మూడు రాజధానుల ఏర్పాటు గడువును జగన్ సర్కారు మే నెలాఖరుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ (ఏపీఎస్ ఏ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరిగింది.
ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖకు తరలించే విషయంపైనే ప్రధానంగా చర్చ జరగగా... మే నెలాఖరు నాటికి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖలో ఏర్పాటు చేసే దిశగా జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని ఏపీఎస్ ఏ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి తెలిపారు. ఎగ్జిక్యూటవ్ కేపిటల్ ను విశాఖలో ఏర్పాటు చేయాలంటే... ప్రస్తుతం అమరావతిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా విశాఖకు తరలాల్సిందే కదా. అంతేకాకుండా ఆయా ప్రభుత్వ కార్యాలయాలు కూడా విశాఖకు తరలాల్సిందే. ఇందుకు ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు తప్పనిసరి. ఈ కోణంలోనే ఆలోచించిన జగన్ సర్కారు... ప్రభుత్వ నిర్ణయం మేరకు విశాఖకు తరలివచ్చే ఉద్యోగులకు పలు తాయిలాలు ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఉద్యోగులంతా విశాఖకు తరలిన వెంటనే వారందరికీ 30 శాతం మేర డీఏను ఇచ్చేందుకు జగన్ సర్కారు సిద్ధంగా ఉందట. అంతేకాకుండా ఇళ్లు - ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా రుణ సదుపాయం - ఉద్యోగుల బదిలీలు - అమరావతిలో ఇల్లు గానీ - ఇంటి స్థలం గానీ లేని వారికి విశాఖలో ఇంటి స్థలం గానీ - ఇల్లు గానీ కొనుగోలు చేసుకునేందుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చేందుకు కూడా జగన్ సరేనన్నారట. అంతేకాకుండా విశాఖకు రాజధాని తరలింపునకు సంబంధించి ప్రతి చిన్న సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని కూడా జగన్ సర్కారు ఉద్యోగులకు హామీ ఇచ్చిందట. ఏది ఏమైనా జూన్ ప్రారంభం నుంచి విశాఖ నుంచే పాలనను సాగించాలన్న కసితో జగన్ ఉన్నట్లుగా ఈ సమావేశంలోచర్చకు వచ్చిందట. అంటే... విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలింపు మే నెలాఖరులోగా పూర్తి అవుతుందన్న మాట.