నితీశ్ "తగ్గేదేలే"... బ్యాట్ తో "పుష్ప"ను చూపించాడు!

ప్రస్తుతం భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, భారతీయులు, సినిమా అభిమానులు "పుష్ప-2" ఫీవర్ లో ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-12-28 06:03 GMT

ప్రస్తుతం భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, భారతీయులు, సినిమా అభిమానులు "పుష్ప-2" ఫీవర్ లో ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ రాజకీయాల్లో అయితే ‘పుష్ప’ వేడి పీక్స్ కి చేరిందని అంటున్నారు. ఈ సమయంలో.. తాజాగా అంతర్జాతీయ వేదికపై టీమిండియా క్రికెటర్ తన బ్యాట్ తో "పుష్ప"ని చూపించాడు.

అవును... ‘పుష్ప’ మేనియా ఇప్పుడు పీక్స్ కి చేరిందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పుష్ప సినిమాలోనే "తగ్గేదేలే" అంటూ గడ్డం మేనరిజంతో చేసి చూపించారు విరాట్ కొహ్లీ, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ క్రికెటర్లు. ఈ నేపథ్యంలో తాజాగా అంతకు మించి అన్నట్లుగా ‘పుష్ప’ ని చూపించాడు టీమిండియా క్రికెటర్, తెలుగు బిడ్డ నితీశ్ కుమార్ రెడ్డి.

ఇందులో భాగంగా... తాజాగా ఆసిస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ప్రస్తిద్ధ మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో పుష్ప సెలబ్రేషన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తైన అనంతరం ‘పుష్ప’ సిగ్నేచర్ స్టైల్ ని తన బ్యాట్ తో చేసి చూపించాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయింది! దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కాగా... మెల్ బోర్న్ టెస్టులోని భారత్ ఫాలో ఆన్ నుంచి గండం బయటపడింది. దీనికి కారణం టీమిండియా స్టార్ క్రికెటర్ గా అవతరించబోతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. బోర్డర్ – గవస్కర్ ట్రోఫీతోనే టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్... తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే పుష్ప మేనరిజం "తగ్గేదేలే" తో సంబరాలు చేసుకున్నాడు.

మరోపక్క అతడికి తోడుగా వాషింగ్టన్ సుందర్ కీలక పరుగులు చేశాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు.

Tags:    

Similar News