'పక్కకి రండి' అంటూ అభిమానులపై సేనాని సీరియస్!
తాజాగా మరోసారి 'పక్కకి రండి' అంటూ సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటన కడప పర్యటనలో చోటు చేసుకుంది.
స్టార్ హీరోలు రోడ్ల మీదకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అభిమానులంతా షేక్ హ్యాండ్ కోసం, సెల్పీల కోసం, ఫోటోల కోసం, సంతకాల కోసం ఎగబడుతుంటారు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే సన్నివేశం ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అభిమానుల తీరుతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సందర్భాలెన్నో. కాళ్ల మీద పడుతుంటే? 'పక్కకు పో' అంటూ అసహనం వ్యక్తం చేసిన సందర్భం ఉంది.
తాజాగా మరోసారి 'పక్కకి రండి' అంటూ సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటన కడప పర్యటనలో చోటు చేసుకుంది. పర్యటనలో భాగంగా ఎంపీడీవోను పరామర్శించి పవన్ మీడియాతో మాట్లాడారు. ఆయన సీరియస్ మాట్లాడుతోన్న సమయంలో అభిమానులు, జన సైనికులు 'ఓజీ.. ఓజీ' అంటూ అరవడం మొదలు పెట్టారు. ఒకళ్లను చూసి మరొకరు ఆ నినాదం అందుకోవడంతో ప్రాంగణం దద్దరిల్లింది.
దీంతో పవన్ కల్యాణ్ ' ఏంటయ్యా మీరు... ఎప్పుడు ఏ స్లోగాన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి' అంటూ అసహనం వ్యక్తం చేసారు. దీంతో అభిమానులు కూడా కాస్త ఫీలైనట్లు కనిపించింది. ఆయన ఇలా 'పక్కకు రండి' అనడం తొలిసారి కాదు. గతంలోనూ ఓ వేదికపై ప్రసంగిస్తుండగా ఓ అభిమాని పవన్ పాదాభివందనం కోసం ఒక్కసారిగా పరుగందుకుని ఆయన వద్దకు చేరుకుని వొంగొని పాదాలకు దణ్ణం పెట్టబోయాడు.
దీంతో పవన్ వెంటనే 'పక్కకు పో' అంటూ సీరియస్ అయ్యారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి 'పక్కకు రండి' అన్నది నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డేట్లు ఇస్తే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ఎదురు చూస్తున్నారు.