నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో అక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలున్నారని వైసీపీ అధినేత జగన్ పత్రికలో వస్తున్న కథనాల విషయంలో రాజధాని రైతులు ఆందోళనలు ప్రారంభించారు. జగన్ సహా ఆయన పత్రిక తీరుపై ఏపీ రాజధాని రైతులు మండిపడ్డారు. రాజధానిపై అవాస్తవ ఆరోపణలు గుప్పిస్తున్నారని రైతులు పేర్కొంటూ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం నుంచి మందడం గ్రామం వరకు జగన్ దిష్టిబొమ్మను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడ దహనం చేశారు. అనంతరం మందడం జడ్పీ హైస్కూల్ లో రాజధాని రైతుల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి 29 గ్రామాలకు చెందిన సుమారు 1000 నుంచి 1500 మంది రైతులు హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ టీడీపీ నేతలపై దుష్ప్రచారం కారణంగా రాజధాని నిర్మాణానికి ఆటంకం కలగడమే కాకుండా, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ - జడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచందర్ రావు - మంగళగిరి మున్సిపల్ చైర్మన్ చిరంజీవితో పాటు 29 గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.