స‌మ్మె స‌భ నుంచి ఎలా త‌ప్పించుకుందాం..!

Update: 2022-02-04 12:31 GMT
వైసీపీ స‌ర్కారుకు ఇప్పుడు ప్ర‌ధాన‌స‌మ‌స్య‌.. ఉద్యోగుల నుంచే రావ‌డం.. ఈ విష‌యంలో ఆచి తూచి వ్య‌వ హరించినా.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసినా.. అవి స‌క్సెస్ కాక‌పోవ‌డం.. నానాటికీ ఉద్యోగుల ఆందోళ‌న మ‌రింత పెర‌గ‌డం .. వంటివి స‌ర్కారుకు ఇబ్బందిగా మారింద‌నేది వాస్త‌వం. గురువారం నిర్వ‌హించిన చ‌లో విజ‌య‌వాడ స‌క్సెస్ అయింద‌ని.. ఉద్యోగులు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. ఉద్యోగులు విజ‌య‌వాడ వెళ్ల‌కుండా.. పోలీసులు ఎన్ని ర‌కాలుగా అడ్డుకున్నా... ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డం... వేలాదిగా ఉద్యోగులు విజ‌య‌వాడ‌కు త‌ర‌లి రావ‌డం వంటివి.. ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింద‌నే చెప్పాలి.

ఇవ‌న్నీ ఇలా.. ఉంటే.. మ‌రోవైపు ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యోగులు పూర్తిగా త‌మ విధుల‌కు దూరంగా ఉంటామ‌ని.. పూర్తిస్థాయిలో స‌మ్మెకు దిగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే జ‌రిగితే.. ప్ర‌బుత్వం చేప‌ట్టిన అనేక ప‌థకాల‌పై ప్ర‌భావం చూపుతుంది?  అదే స‌మ‌యంలో ఆదాయం కూడా ప‌డిపోయే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఏం చేయాలి?  ఉద్యోగుల‌ను ఎలా నిలువ‌రించాల‌నే విష‌యంపై స‌ర్కారు త‌ర్జ‌న భ‌ర్జన ప‌డు తోంది. అదేస‌మ‌యంలో ఉద్యోగుల‌తో చ‌ర్చ‌ల క‌మిటీలో స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి ప్ర‌మేయాన్ని త‌గ్గించాల‌ని కూడా.. ప్ర‌బుత్వం చూస్తోంది.

ఇది చేయ‌డం ద్వారా.. ఉద్యోగుల‌ను శాంతింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేయొచ్చ‌ని భావిస్తున్నారు. అదేస‌మ యంలో ముఖ్య‌మంత్రి స్వ‌యంగా రంగంలోకి దిగి.. ఉద్యోగుల‌ను లైన్‌లోకి తీసుకురావొచ్చ‌ని కూడా అం టున్నారు. ఇవ‌న్నీ.. ఒకవేళ అప్ప‌టికీ.. సక్సెస్ కాకపోతే.. ఎస్మా ప్ర‌యోగించాల‌ని కూడా స‌ర్కారు భావిస్తుం డ‌డం గ‌మ‌నార్హం. అయితే. ఈ విష‌యంలో చివ‌రి నిర్ణ‌యంగానే ఇది ఉంటుంద‌ని.. దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌న్నా.. ఎక్కువ‌గా ఇబ్బందులే ఉంటాయ‌ని స‌ర్కారు భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు స‌మ్మె నుంచి వెన‌క్కి మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News