వైసీపీ రంగులు మార్చండి: సీఎం జగన్

Update: 2020-06-28 05:30 GMT
ప్రభుత్వ కార్యాలయాలు.. గ్రామ పంచాయతీ కార్యాలయాలపై వైసీపీ రంగులు ఉండడం.. దానిపై ప్రతిపక్ష టీడీపీ రచ్చ చేయడం.. హైకోర్టు వరకు కేసులు వెళ్లడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. హైకోర్టు కూడా రంగులు మార్చాలని ఆదేశించింది. అయితే కరోనా వేళ ఇదో ఆర్థిక భారం అని వైసీపీ ప్రభుత్వం మిన్నకుంది.

అయితే తాజాగా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయితీ కార్యాలయాల రంగులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే రంగులు మార్చాలని పంచాయితీలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని ఆదేశించింది.

వైసీపీ పార్టీ రంగులను పోలిన నీలం, ఆకుపచ్చ రంగులను వెంటనే తొలగించాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

గ్రామ సచివాలయాలన్నింటికి హాఫ్ వైట్ వేయాలని.. కింద రెండున్నర అడుగుల వరకు ఎర్రమట్టి రంగు అంచు పూయాలని, దానిపై గ్రామీణ సంస్కృతిని పోలే ముగ్గులు వేయాలని వైసీపీ ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Tags:    

Similar News