ఉద్యోగులకు శుభవార్త.. ఈ నెల నుంచి పూర్తి జీతం !

Update: 2020-05-21 10:10 GMT
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. వైరస్ నేపథ్యంలో గత రెండు నెలలుగా సగం జీతాలు మాత్రమే తీసుకుంటున్న ఎంప్లాయిస్ కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఊరట నిచ్చింది. జీతాలు, గత రెండు నెలల బకాయిలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో అందరికి మే నెల జీతాలు పూర్తిస్థాయిలో పడనున్నాయి. ఈ మేరకు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలకు సీఎంఓ నుంచి
ఆదేశాలు అందాయి.

ఫ్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ట్రెజరీ సాఫ్ట్ వేర్‌ లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి సీఎఫ్ ఎం ఎస్ ‌లో మార్పులు అందుబాటులోకి రానున్నాయి. అయితే, మార్చి, ఏప్రిల్ నెలలో తగ్గించిన జీతాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మహమ్మారి లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గిపోవడంతో ఉద్యోగుల జీతాలను కొంతమేర తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఉద్యోగుల స్థాయిని బట్టి వేతనాల్లో కోత పెట్టింది.

అది పూర్తి స్థాయిలో కోత పెట్టడం కాదని, మళ్లీ చెల్లింపులు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం లాక్ డౌన్ మినహాయింపులు వచ్చాయి. కొన్ని కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరో పది రోజుల్లో రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరనుంది. ఈ క్రమంలో ఈనెల జీతాలను పూర్తిస్థాయిలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Tags:    

Similar News