పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం

Update: 2021-12-14 10:30 GMT
ఏపీ ప్రభుత్వం పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి వృద్ధాప్య పింఛన్ ను రూ.2250 నుంచి రూ.2500 పెంచుతున్నట్టు ప్రకటించింది. నూతన సంవత్సరం వేళ జనవరి 1 , 2022 నుంచి ఇది అమలు కానుందని స్పష్టం చేసింది.

ఏపీలో వృద్ధాప్య పింఛన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛన్ రూ.2500 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఒమిక్రాన్ వ్యాప్తి , కోవిడ్ ఆంక్షలతో పాటు జగనన్న సంపూర్ణ గృహ హక్కు, ఖరీఫ్ లో ధాన్యం కొనుగోళ్లు సహా రైతు సమస్యలపై అధికారులతో సీఎం చర్చించారు.

ఈనెల 21న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని జగన్ అమలు చేయనున్నారు. జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామని జగన్ తెలిపారు. కాగా ప్రస్తుతం నెలనెలా ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పింఛను రూ.2250గా ఉంది.

అగ్రవర్ణ నిరుపేద మహిళలకు మూడేళ్లలో రూ.45వేలు సాయం అందుతుందని చెప్పారు. జనవరిలోనే రైతు భరోసా సాయం ఇస్తామని స్పష్టం చేశారు.


Tags:    

Similar News