ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు సంక్షేమ పధకాలను అమలు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా రైతు భరోసా డబ్బును లబ్దిదారులైన రైతులకు అందించిన జగన్ ఇప్పుడు కొత్తగా వారి కోసం ఓ ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించారు. అదే ఆంధ్రాగ్రీన్స్.కామ్ .
ఆంధ్రాగ్రీన్స్.కామ్ పేరిట ఉన్న ఈ ఆన్ లైన్ మార్కెటింగ్ వెబ్ సైట్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. . కర్ణాటకలో కాల్గుడి.. తెలంగాణలో టీప్రెస్ ఈ సంస్థ మార్కెటింగ్ చేస్తోందన్నారు. రైతులు పండించే పండ్లు, కూరగాయలను ఈ సంస్థ నేరుగా కొనుగోలు చేసి ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తుందని తెలిపారు. అంతేకాకుండా నేరుగా కొనుగోలుదారుడి ఇంటికే వాటిని చేరుస్తుందన్నారు.
అలాగే , రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. మరో 15 రోజుల సమయం ఇవ్వాలని, ఆ తరువాత జాబితా ప్రకటించాలని తెలిపారు. జులై 8న అర్హులైన 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మే 6 నుంచి 21 వరకూ జాబితాలు ప్రదర్శించాలని, ఆ తర్వాత మరో 15 రోజుల పాటు పరిశీలించి జూన్ ఏడులోగా తుదిజాబితాను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.