ఆంధ్రావనికి సంబంధించి ఓ రగడ పార్లమెంట్ కేంద్రంగా నిన్నటి వేళ నడిచింది. ఇప్పటికే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ఆవాస్ యోజనలో భాగంగా నాలుగు నెలలుగా పంచాల్సిన బియ్యాన్ని పంచలేదని వివాదం రేగింది.దీంతో దిగివచ్చిన రాష్ట్ర సర్కారు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సంబంధిత బియ్యం అందించేందుకు సిద్ధం అయింది. అది కూడా పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన మాట ప్రకారం.. ఆ రోజు రాష్ట్రం చేసిన తప్పిదాలు అన్నీ వెలుగులోకి వచ్చేయి.
తరువాత జగన్ ప్రభుత్వం కూడా తప్పులు దిద్దుకుంది. తాజాగా కేంద్రం మరో ప్రకటన చేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న రేషన్ పంపిణీ కి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలే చేసింది. తమ దగ్గర తీసుకుంటున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పంచడం లేదని ఆరోపణలు ఆధార సహితంగాచేస్తోంది.
గడిచిన మూడున్నరేళ్లలో కేంద్రం దగ్గర తీసుకున్న దానికి, రాష్ట్ర ప్రభుత్వం పంచిన దానికి పెద్ద అంతరమే ఉందని తేలిపోయింది. ఈ లెక్కన ఐదు లక్షల 65వేల 964 మెట్రిక్ టన్నుల మేర వ్యత్యాసం ఉందని కేంద్రం గుర్తించింది. సంబంధిత ప్రకటన ఒకటి పార్లమెంట్ లో నిన్నటి వేళ చేసింది.
వాస్తవానికి ప్రజా పంపిణీ పథకం, ఆహార భద్రత పథకం కింద బియ్యంతో సహా కొన్ని గోధుమలు కూడా అందిస్తున్నారు. ఈ పథకాల అమల్లో భాగంగా కేంద్రం నుంచి తీసుకున్న ఆహార ధాన్యాలు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఐదు లక్షల మిలియన్ టన్నులకు పైగా మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంది అన్న వివరం ఒకటి పార్లమెంట్ నివేదిక అందిస్తున్నది.
మొదట్నుంచి ఆహార ధాన్యాల పంపిణీ విషయమై ఇదే విధంగా తాత్సారం చేస్తోందని ఓ ఆరోపణ కూడా చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గడిచిన మూడున్నరేళ్లలోవైసీపీ చెప్పిందొకటి చేసిందొకటి అని తేల్చేసింది.
2019 - 20 ఏడాదికి సంబంధించి 88,822 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయకుండా తన వద్దే ఉంచుకుంది అని ఆరోపిస్తోంది కేంద్రం. ఇదే విధంగా తరువాత ఏడాది కూడా 4,17,853 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం పంపిణీ చేయలేదు అని, తరువాత ఏడాది 30,539 టన్నుల ఆహార ధాన్యం పంపిణీ చేయలేదని తేలిపోయింది. ఈ భారీ మొత్తంలో తేడా ఎక్కడా లేదని, తాము అందించిన ధాన్యానికి , పంపిణీ చేసిన ధాన్యానికి మధ్య తేడా చాలా ఎక్కువగా ఉందని, ఈ విషయంలో దేశంలోనే ఏపీ టాప్ పొజిషన్లో ఉందని తేల్చేసింది.