జాతీయ మీడియా ఏపీ ప్రభుత్వం మండిపడింది. రిపబ్లిక్ టీవీ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం కావడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని రిపబ్లిక్ టీవీ తప్పుడు కథనం ప్రచారం చేయడంపై సజ్జల ఫైర్ అయ్యారు. మార్చి 4న జగన్ సన్నిహితుడిపై ఫేక్ వార్తను ప్రసారం చేయడంపై ధ్వజమెత్తారు.
జాతీయ మీడియా ముసుగులో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని రిపబ్లిక్ టీవీని సజ్జల హెచ్చరించారు. ఫేక్ న్యూస్ పై న్యాయపరంగా ప్రోసీడ్ అవుతామని స్పష్టం చేశారు.
5 కోట్ల మంది ఆదరాభిమానాలున్న వైసీపీపై తప్పుడు కథనాలు బాధాకరమని సజ్జల పేర్కొన్నారు. వైసీపీలో ఎలాంటి సంక్షోభం కానీ గందరగోళం కానీ లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం రిపబ్లిక్ టీవీలో ఇలాంటి కథనాలు వండి వార్చారన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. నిత్యం వివాదాల్లో ఉండే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి జాతికి పట్టిన పీడ అని ధ్వజమెత్తారు.