ఏపీలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా

Update: 2021-05-02 13:18 GMT
ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆదివారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌రోనా విజృంభిస్తున్న వేళ విప‌క్షాల‌తోపాటు హైకోర్టు కూడా ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని సూచించింది. ఈ నేప‌థ్యంలోనే ఇంట‌ర్ ప‌రీక్ష‌లను వాయిదా వేస్తూ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలో సుమారు 30 ల‌క్ష‌ల మందికిపైగా విద్యార్థులు టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంది. వీరితోపాటు విద్యార్థుల త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లు, ఇన్విజిలేట‌ర్లు ప‌రీక్షా కేంద్రాల‌కు వ‌చ్చి వెళ్లాల్సి ఉంటుంది. ప‌రీక్ష‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ ఈ ప్ర‌క్రియ కొనసాగుతుంది. కాబ‌ట్టి.. క‌రోనా విస్త‌రించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

దీంతో.. పున‌రాలోచించిన ప్ర‌భుత్వం ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా వేడానికి మొగ్గు చూపింది. అయితే.. టెన్త్‌ పరీక్ష‌ల విష‌యంలో మాత్రం స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోలేదు. దీంతో.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు కొన‌సాగుతాయా? లేదా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News