విశాఖ డాక్టర్ సుధాకర్ కేసు లో హైకోర్టు లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుపై శుక్రవారం కూడా అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ కు తెలిపి అతడి అనుమతి తో డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ కావొచ్చని హైకోర్టు సూచించింది. అయితే సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆ విచారణకు సహకరించాలని సుధాకర్ ను హైకోర్టు ఆదేశించింది.
తన కుమారుడు డాక్టర్ సుధాకర్‌పై దాడి.. కస్టడీలో ఉండడంపై అతడి తల్లి కావేరిబాయి గురువారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడు సుధాకర్‌ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని.. 24 గంటల్లో డాక్టర్ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ పిటిషన్ వేశారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఆమె పిటిషన్ వేయడం ఆసక్తి రేపింది. దీంతోపాటు విశాఖ మానసిక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించాలని డాక్టర్ సుధాకర్ వేసిన పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదావేసింది.
రోడ్డుపై అర్ధనగ్నంగా అచేతన స్థితిలో కనిపించిన డాక్టర్ సుధాకర్‌ను మే 16వ తేదీన విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సుధాకర్ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయమై హైకోర్టులో దాదాపు పది పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించారని టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టు కు లేఖ రాశారు. దీంతో పాటు అతడి తల్లి, మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటిపై హైకోర్టు విచారణ చేస్తోంది. ఈ సమయంలోనే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. హైకోర్టు అన్ని పిటిషన్‌లపై విచారణ చేస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.