ఈఎస్ఐ కేసు సీబీఐకివ్వాలి..హైకోర్టులో పిటీషన్

Update: 2020-06-14 04:41 GMT
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ ఐ స్కాంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పలువురు మాజీ అధికారులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్కాంలో ఏ1గా ఉన్న అప్పటి ఈఎస్ ఐ డైరెక్టర్ రమేశ్ కుమార్ భార్య తాజాగా హైకోర్టుకు ఎక్కింది.

తాజాగా తన భర్తకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ చేయకుండా చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ రమేశ్ కుమార్ భార్య హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందని.. తక్షణం కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని రమేశ్ కుమార్ భార్య స్మితారాణి హైకోర్టు పిటీషన్ లో కోరారు.

ఇక ఈ మొత్తం అరెస్టుల వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టులో న్యాయవాది పీవీ కృష్ణయ్య హౌస్ మోహన్ పిటీషన్ దాఖలు చేశారు. నోటీస్ ఇవ్వకుండా రమేశ్ కుమార్ ను అరెస్ట్ చేశారని.. కారణాలు చెప్పలేదని.. నిబంధనలకు విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

దీనిపై ఏపీ ప్రభుత్వం తరుఫు న్యాయవాది కోర్టులో వాదించారు. తాము అన్ని ఆధారాలు ఉన్నందున నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. నిందితులను జ్యూడిషియల్ కస్టడీకి పంపామన్నారు. రెగ్యులర్ కోర్టులో తదుపరి వాదనలు వింటామన్న హైకోర్టు సోమవారానికి ఈ కేసును వాయిదా వేసింది.


Tags:    

Similar News