వలంటీర్లు ఎవరు? వారికున్న చట్టబద్ధత ఏంటి? : జగన్ సర్కారును నిలదీసిన హైకోర్టు
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవస్థ వలంటీర్లు. నాడు ఎన్టీఆర్ మండల వ్యవస్థను తీసుకు వచ్చిన విధంగానే ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. సీఎం జగన్ తీసుకువచ్చిన కీలక వ్యవస్థ వలంటీర్లు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పైచిలుకు వలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిగా నిలవడం.. వీరి ప్రధాన కర్తవ్యమని.. సీఎం జగన్ ఆనాడే చెప్పారు.
ఇక, ఈ వలంటీర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. వీరు ఎలాంటి నిర్లక్ష్యం చూపినా.. విధుల నుంచి తక్షణమే తొలగిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న వారిని నిముషం కూడా ఆలస్యం చేయకుండా.. పక్కన పెడుతున్నారు. ఈ వలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు , విమర్శలు కూడా వున్నాయి. వీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా కంటే.. కూడా.. వైసీపీకి, ప్రజలకు మధ్య పనిచేస్తున్నారనే విమర్శలు ఆది నుంచి వినిపిస్తున్నాయి.
ఇదిలావుంటే.. తాజాగా ఈ వలంటీర్ వ్యవస్థపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ను నిర్ణయించేందుకు వారికున్న అధికారం ఏమిటని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారు అసలు ప్రభుత్వ ఉద్యోగులేనా? సర్వీసు రూల్స్ ఉన్నాయా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్ల జోక్యం ఏమిటని నిలదీసింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడు.. ప్రభుత్వ ఉద్యోగులే కాని వలంటీర్లతో లబ్ధిదారులను ఎందుకు ఎంపిక చేయిస్తున్నారని ప్రశ్నించింది.
అంతేకాదు, ఈ విషయంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత వలంటీర్లు, అధికారులకు నోటీసులు జారీచేసింది. విచారణ వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ శుక్రవారం ఆదేశాలిచ్చారు. వై ఎస్సార్ చేయూత పథకం కింద గతంలో లబ్ధి పొందిన తమను రాజకీయ కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని పేర్కొంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్.వసంతలక్ష్మి, మరో 26మంది హైకోర్టును ఆశ్రయించారు.
శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది అరుణ్‌శౌరి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగానే హైకోర్టు.. వలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించింది. దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటని నిలదీసింది. అదేసమయంలోఅసలు వలంటీర్లు.. ప్రభుత్వానికి సేవకులా.. ప్రజలకు సేవలుగా.. పార్టీకి సేవలుగా తేలుస్తామని కీలక వ్యాఖ్యలు సైతం చేసింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవస్థపై సందేహాలు.. అనుమానాలు.. ముసురుకున్నాయి. మరి ప్రభుత్వం ఏం చెబుతుందో.. హైకోర్టు అంతిమంగా ఏం తేలుస్తుందో చూడాలి.