జ‌గ‌న్ స‌ర్కార్ హైకోర్టు మ‌రో షాక్‌.. 12 % వ‌డ్డీతో చెల్లించాల‌ని తీర్పు..!

Update: 2021-10-05 12:24 GMT
ఏపీ ప్ర‌భుత్వానికి కోర్టుల నుంచి వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వం తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌పై కోర్టు స్టే విధించ‌డ‌మో లేదా ప్ర‌భుత్వ ఆలోచ‌న‌కు వ్య‌తిరేకంగా తీర్పు ఇవ్వ‌డ‌మో జ‌రుగుతూ వ‌స్తోంది. తాజాగా మ‌రోసారి హైకోర్టు నుంచి ఏపీ ప్ర‌భుత్వానికి షాక్ ఇస్తూ మరో తీర్పు వెలువ‌డింది. జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ప‌నులు ఏపీలో జోరుగా జ‌రుగుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించిన ప‌నిదినాల‌ను మూడు నెల‌ల ముందుగానే వాడేసుకున్నార‌న్న సందేహాలు కూడా ఉన్నాయి.

అయితే కేంద్రం డిసెంబ‌ర్ వ‌ర‌కు కేటాయించిన ప‌ని దినాల‌ను రాష్ట్రం సెప్టెంబ‌ర్‌కే వాడేసుకుంద‌న్న అనుమానాల నేప‌థ్యంలో విచార‌ణ కూడా జ‌రుగుతోంది. రాష్ట్రం ప‌ని దినాల‌ను వాడేసుకుంటున్నా.. అందుకు త‌గిన‌ట్టుగా బిల్లులు మాత్రం చెల్లించ‌డం లేదు. ఈ బిల్లుల చెల్లింపున‌కు సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువ‌రించింది. మొత్తం 1013 పిటిష‌న్లు విచారించిన కోర్టు ఉపాధి హామీ ప‌థ‌కానికి సంబంధించిన బిల్లులు అన్నింటిని నాలుగు వారాల్లోపు చెల్లించాల‌ని స్ప‌ష్టం చేసింది.

అలాగే ఉపాధి హాపీ ప‌థ‌కం బిల్లుల్లో 20 శాతం క‌ట్ చేసి చెల్లించాలంటూ జ‌గ‌న్  ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోను సైతం కోర్టు కొట్టి వేసింది. ఈ బ‌కాయిల‌ను 12 % వ‌డ్డీతో నాలుగు వారాల్లో చెల్లించాల‌ని తేల్చి చెప్పింది. అయితే ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కొంత బిల్లులు చెల్లిస్తే.. మిగిలిన పెండింగ్ మొత్తానికి 12 % వ‌డ్డీ వేసి చెల్లించాల‌ని పేర్కొంది. త‌మ ఉత్త‌ర్వులు అమ‌లు చేయ‌ని ప‌క్షంలో కోర్టు ధిక్క‌ర‌ణ చ‌ర్య‌ల‌కు సైతం తాము వెనుకాడ‌బోమ‌ని కూడా వార్నింగ్ ఇచ్చింది.

అస‌లు ప‌లు ప‌నుల బిల్ల‌ల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తోన్న ప్ర‌భుత్వం కోర్టు తాజా తీర్పుతో ఏం చేస్తుందో ?  చూడాలి.
Tags:    

Similar News