పోలవరం ప్రాజెక్టుపై ఏపీ కీలక ఉత్తర్వులు

Update: 2021-04-19 14:30 GMT
పోలవరం అంచనాలు మళ్లీ పెంచేశారు. ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్ అంచనాలు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ అంచనాలను రూ.7192 కోట్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.

గతంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ వ్యయం రూ.5535 కోట్లుగా జలవనరుల శాఖ నిర్ధారించింది. అయితే అవి ఇప్పటి భారీగా పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలకు సరిపోవడం లేదు. దీంతో స్పిల్ వే, ఈసీఆర్ఎఫ్, స్పిల్, పైలట్ ఛానల్ తదితర నిర్మాణాల అంచనాలను మరో రూ.1600 కోట్ల మేర పెంచుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవలే సీఎం జగన్ సాగునీటిపారుదల శాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వర్షాలు వచ్చేలోగా పూర్తి చేయాల్సిన పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. కాఫర్ డ్యాంలో ఖాళీలు పూర్తి చేసి అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, గేట్ల పూర్తి, మెయిన్ డ్యాం పనులు తదితర కీలక పనులపై సీఎం జగన్ సమీక్షించారు.

ఈ ఎండాకాలం అత్యంత కీలకం అని.. రానున్న 45 రోజుల్లో వర్షకాలం వచ్చేలోపు వేగంగా పనులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.  ఏపీ కలల ప్రాజెక్ట్ పోలవరం విషయంలో నిధులకు వెనుకడుగు వేసేది లేదని.. అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే నిధుల విడుదలతో సహా అన్ని రకాలుగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని జగన్ పేర్కొన్నారు.
Tags:    

Similar News