ఏపీలో ఈసీ , ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న మాటల యుద్దానికి సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పుతో తెరపడింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేము అంటున్న సమయంలో సుప్రీం ఎన్నికలు జరిపి తీరాల్సిందే అంటూ తీర్పు వెల్లడించడంతో ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తుంది. అప్పుడే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.
పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ లు ఆన్ లైన్ ద్వారా వేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బేజషాలు లేకుండా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. గతంలో ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఏకగ్రీవాలు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా ఉండేలా చూడాలి.
అభ్యర్థులపై దాడులు నియంత్రించేలా రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలి. నిర్భంధంగా నామినేషన్ విత్ డ్రా చేసేలా కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. పోలీసులు, ఇతర విభాగాలు కూడా ఎన్నికల సంఘానికి సహకరించాలి. బీజేపీ, జనసేన రెండు పార్టీలు కలిసే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థలకు మద్దతు ఇస్తాం. తిరుపతి ఉప ఎన్నికలో ఇరు పార్టీల నుంచి ఒక అభ్యర్ధే బరిలో ఉంటారు అని సోమువీర్రాజు స్పష్టం చేశారు.