మంత్రి భూఆక్రమణ.. కాదని చెప్పాల్సింది కలెక్టర్.. మంత్రి కార్యాలయం కాదు!
ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వారు ధర్మపీఠం మీదకు ఎక్కి.. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి పనే చేశారు ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్. ఆయన మీద కబ్జా ఆరోపణలు చేశారు పెద్ద వయసున్న భార్యభర్తలు. కానీ.. మంత్రి మాత్రం తాను కబ్జా చేయలేదన్న ప్రకటనను తన ఆఫీసు కార్యాలయం ద్వారా ఒక ప్రకటనను విడుదల చేశారు. నిజంగానే మంత్రివారు ఎలాంటి తప్పు చేయకుంటే.. తన మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపి.. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచన చేస్తే ఎలా ఉంటుంది?
అందుకు భిన్నంగా బుల్ డోజ్ చేస్తూ.. తన వాదనను వినిపిస్తున్న మంత్రి సురేశ్ తీరు ఇలా ఉంటే.. తమ భూమి కబ్జాకు గురైందన్న వాదనను వినిపిస్తున్న వారు.. పుట్టింటి వారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఎకరా పొలాన్ని ఆక్రమించినట్లుగా ఆరోపిస్తున్నారు. గడిచిన పదిహేనేళ్లుగా పలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ వేదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ను కలిసిన ఆమె.. తన పొలాన్ని మంత్రి సురేశ్ అక్రమించారని.. ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. తనను ఆదుకోవాలని ఆమెకోరుకుంటున్నారు.
కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఏమని చెప్పుకున్నారంటే.. ఇడుపూరులో సర్వే నెంబరు 841/1లోని ఎకరా పొలాన్ని పసుపు కుంకుమ కింద కేసరి రంగలక్ష్మమ్మ అనే మహిళ పేరుతో మా పుట్టింటివారు 2008లో రిజిస్ట్రేషన్ చేశారు (రిజిస్ట్రేషన్ నెంబరు 1615). ఆ ఎకరా భూమిని మంత్రి సురేశ్ తన విద్యా సంస్థల కోసంకబ్జా చేశారు. సర్వే నెంబరు 841/1లో మొత్తం 13.7ఎకరాలు ఉండగా అందులో ఆరుగురు హక్కుదారులు. వీరిలో నలుగురు నుంచి తప్పుడు పత్రాలతో మంత్రి సురేశ్ భూమిని కొనుగోలు చేవారు. ఎమ్మెల్యే అయ్యాక సురేశ్ మా పాసు పుస్తకాలు రద్దు చేయించి వాటిని రికార్డుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. దీనిపై మంత్రి సురేశ్ కార్యాలయం స్పందించింది. మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశాయి.
గతంలో ఈ భూమిని మంత్రి సోదరుడు ఆక్రమించినట్లుగా అధికారులకు ఫిర్యాదు చేశారని.. ఇప్పుడు మంత్రి పైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదే అంశంపై మార్కాపురం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రంగలక్ష్మమ్మ వేసిన దావాను 2018లో కోర్టు డిస్మిస్ చేసిందంటున్నారు. అటు మహిళ వాదన.. ఇటు మంత్రి ప్రకటన కంటే కూడా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి నిజానిజాల్ని స్పష్టం చేస్తే బాగుంటుంది. అదే అధికారికం అయితే మరింత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.