మాజీ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని గత ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఐటీ సోదాల నేపథ్యంలో 2వేల కోట్ల రూపాయల అవినీతి గుట్టు రట్టయిందని ప్రచారం జరిగింది. త్వరలోనే బాబు అండ్ కో అవినీతి చిట్టా ఆధారాలతో సహా బయటపడుతుందని టాక్ వస్తోంది. ఓ పక్క ఐటీ సోదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న బాబుకు ఈఎస్ ఐ కుంభకోణం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు వస్తున్నప్పటికీ....ఈ స్కాం వెనుక బాబు హస్తముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడుతోపాటు బాబు కూడా జైలుకు వెళతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వ్యాఖ్యలను బలపరుస్తూ బాబుతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులు జైలుకు వెళ్లబోతున్నారంటూ ఏపీ మంత్రి జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈఎస్‌ఐ కుంభకోణం ఆరోపణలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతలు అవినీతి తిమింగలాలంటూ అధికార పక్ష నేతలు దుమ్మెత్తి పోస్తోంటే....తాము పలుగడిగిన ముత్యాలమంటూ ప్రతిపక్ష నేతలు తమకు తామే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. ఇక, అచ్చెన్నాయుడు - బాబుతోపాటు సుజనానాయుడు కూడా జైలుకు వెళతారని - ఆ రోజు కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వైసీపీ కీలక నేత లక్ష్మీ పార్వతి కూడా అన్నారు. ఇక తాజాగా మంత్రి జయరాం కూడా అదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు హయాంలో ఈఎస్ ఐలో రూ.300కోట్ల అవినీతి జరిగిందని - త్వరలోనే ఆ గుట్టు రట్టవుతుందని అన్నారు. ఈ స్కామ్ లో బాబుతోపాటు నాటి కార్మికశాఖ మంత్రులు అచ్చెన్నాయుడు - పితాని సత్యనారాయణలు జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. బాబు హయాంలో అడ్డగోలుగా అవినీతి జరిగిందని..అందినకాడికి దోచుకున్నారని జయరాం ఆరోపించారు.
కాగా, టీడీపీ హయాంలో ఈఎస్ ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈఎస్ ఐ లేని షెల్ కంపెనీలు క్రియేట్ చేసి - నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందని సమాచారం. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ ఐ డైరెక్టర్లు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారట. ఈఎస్ ఐకి చెందిన రవికుమార్ - రమేష్ - విజయలు మందులు - పరికరాలను 135శాతం అధిక ధరకు టెండర్లలో చూపించారని తేలినట్లు తెలుస్తోంది. నకిలీ కొటేషన్లు - షెల్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్ - ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు అక్రమంగా రూ.85కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్కామ్ లో ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు - ఫార్మాసిస్టులు - సీనియర్ అసిస్టెంట్లు సాయం చేశారట. ఈ ముగ్గురు డైరెక్టర్ల హయాంలో జరిగిన రూ.100కోట్ల అవినీతిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.