నాకు నాలుగు కొమ్ములు ఉన్నాయా: కొడాలి నాని

Update: 2022-04-07 13:44 GMT
ఏపీ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని) సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు దుమారం రేపాయి.  కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవ‌ని చెప్పిన నాని.. తాను కూడా అంద‌రి మాదిరిగానే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని ఆయ‌న తెలిపారు. మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ప్ర‌స్తుతం రాజీనామా చేసిన వారిలో కొంద‌రికి స్థానం ఉంటుంద‌ని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

‘అనుభవం రీత్యా కొంతమంది మంత్రులను కొనసాగిస్తున్నట్లు జగన్ చెప్పారు.. కానీ ఎవరిని కొనసాగిస్తున్నారో చెప్పలేదు.. జగన్ ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటాం.. కొత్త కేబినెట్‌లో నేను ఉండే అవకాశం తక్కువ-’ అని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సంద‌ర్భంగా కొడాలి నానికి కొత్త మంత్రివ‌ర్గంలో స్థాన‌ముంటుందా?  అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన నాని... కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవ‌ని వ్యాఖ్యానించారు. కొత్త కేబినెట్‌లో త‌న‌కు స్థానంపై అవ‌కాశాలు త‌క్కువేన‌ని ఆయ‌న చెప్పారు. కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేర‌కు మంత్రివ‌ర్గంలోని అంద‌రం రాజీనామా చేశామ‌ని చెప్పారు.

ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్పార‌న్నారు. మంత్రి ప‌ద‌వుల‌కు తాము రాజీనామా చేస్తుంటే..జ‌గ‌న్ ఎక్కువ‌గా బాధ ప‌డిన‌ట్టుగా క‌నిపించింద‌ని, అయితే తాము ఇష్ట‌పూర్వ‌కంగానే రాజీనామా చేస్తున్నామ‌ని,.  మీరేమీ బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నాని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటిలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేసినట్టు సమాచారం.

24మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ విశ్వభూషణ్ కు పంపనున్నారు. ఈ రాత్రికి ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది.మరోవైపు ఈనెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ఎదుట ప్రమాణ స్వీకార వేదికను నిర్మించాలని నిర్ణయించారు.
Tags:    

Similar News