విషయం ఏదైనా నింద మాత్రం చంద్రబాబు మీద పడటం మామూలే. తనకేమాత్రం సంబంధం లేని విషయాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిట్లు తినటం కొత్తేం కాదు. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు తమ కడుపు కొట్టేశారంటూ మండిపడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల కడుపు కొట్టే ఛాన్స్ లేదు. మరి.. చంద్రబాబు మీద ఈ రేంజ్ లో తెలంగాణ ఎమ్మెల్యేలు ఎందుకింత గుస్సా అన్న విషయాన్ని కదిలిస్తే అసలు విషయం తెలిసింది.
బాబు మీద ఇంత కోపానికి కారణం ఏమిటంటే.. తమ జీతం నెలకు రూ.3.5లక్షల మేర పెరగాల్సి ఉన్నప్పటికీ... ఏపీలో తన నిర్ణయం ద్వారా తనకు తెలీకుండానే తెలంగాణ ప్రభుత్వం మీద తన ప్రభావాన్ని చూపారు చంద్రబాబు.
ప్రస్తుతం రూ.95వేలుగా ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేల జీతాన్ని ర.3.5లక్షల వరకూ పెంచాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. దీని కోసం చాలా కాలం నుంచే ఎదురుచూస్తున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎమ్మెల్యేల జీతాలు రూ.2లక్షలు ఉంటే.. తెలంగాణ ఎమ్మెల్యేల జీతాలు రూ.3.5లక్షలు ఉంటే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో జాగ్రత్త పడిన తెలంగాణ సర్కారు.. జీతాల పెంపును రూ.2.3లక్షలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
బాబు నిర్ణయం ముందు వరకూ తమ జీతం రూ.3.5లక్షలకు పెరుగుతుందని ఆశించిన తెలంగాణ ఎమ్మెల్యేలంతా దాదాపు లక్షకు పైనే తగ్గిపోవటం.. దీనికి బాబు తీసుకున్న నిర్ణయం కారణం కావటంతో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయినా సంపన్న రాష్ట్రానికి అప్పులున్న రాష్ట్రంతో పోలికేంటి? కేసీఆర్ ను తిట్టే ధైర్యం లేక.. చంద్రబాబు పేరును తెరపైకి తీసుకొచ్చి తమ ‘కడుపు మంట’ను తీర్చుకుంటున్నట్లుందే..?