అశోక్ బాబు గారి రాజకీయ ప్రవచనాలు విన్నారా?

Update: 2019-06-28 12:13 GMT
ఓటమి దిగులుతో తెలుగుదేశం నేతలు ప్రజలు ఏమనుకుంటారో కూడా పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘ నేతగా ఎదిగిన అశోక్ బాబు  సమైక్యాంధ్ర ఉద్యమంలో పాపులర్ అయ్యారు. ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో సాన్నిహిత్యం ఏర్పడి ఆ తర్వాత నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. బాబుకు వీర విధేయుడిగా ఉంటూ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

’’జైలుకు వెళ్లి రావడం ముఖ్యమంత్రి కావడానికి ఒక అర్హత గా జనం భావిస్తున్నారని, తాజా ఎన్నికల తీర్పు అలానే ఉందని’’ ఒక టీవీషోలో  అశోక్ బాబు వ్యాఖ్యానించారు. విచిత్రమేంటంటే... కరడుగట్టిన తెలుగుదేశం నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అశోక్ బాబు వ్యాఖ్యలు ప్రజలను అవమానించేలా ఉన్నాయి. జనం జైలు వెళ్లిరావడాన్ని నమ్మారన్నది ఆయన కోణం, కానీ మరి ఆ జైలుకు పంపడమే ఉద్దేశ పూర్వకం అని ప్రజల కోణం అంటూ అశోక్ బాబు మాటలపై వైసీపీ నేతలు, సామాన్యులు మండిపడుతున్నారు.

జగన్ పేరు ప్రస్తావించకపోయినా... జగన్ గెలవడం గురించే ఆయన వ్యాఖ్యల పరమార్థం అన్నది అందరికీ తెలిసిందే. ప్రజలు తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నారు అంటూ ప్రజల తీర్పును పట్టడంపై ఆయన మీద వైసీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. బహుశా చంద్రబాబు దృష్టిలో పడటానికి ఈ వ్యాఖ్యలు పనికొస్తాయేమో గాని వీటిని ఎవరూ హర్షించరు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానిని శిరోధార్యంగా భావించాలి. ఈ కనీస ప్రజాస్వామ్య సూత్రాన్ని అశోక్ బాబు విస్మరించారు.

ఇదేషోలో... ఆయన్ జగన్ చర్యలను ప్రస్తావిస్తూ... చంద్రబాబును జైలుకు పంపడమే జగన్ లక్ష్యం అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబును జైలుకు పంపడం అంటే, అధికారులు ఇరుక్కోవడమే అని పరోక్షంగా అధికారులను హెచ్చరించేలా మాట్లాడారు అశోక్బాబు. చంద్రబాబును వైఎస్ ఏం చేయలేకపోయారని, జగన్ కూడా ఏం చేయలేరన్నది అశోక్ బాబు సూత్రీకరణ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. జగన్ 2014-19 జరిగిన వాటి గురించే చంద్రబాబును విమర్శిస్తూ వచ్చారు. ఈ ఐదేళ్ల అవకతవకల గురించే సబ్ కమిటీ వేశారు అన్న విషయాన్ని మరిచిపోయి అశోక్ బాబు చరిత్రను మాత్రమే ఆలోచిస్తున్నారు.
    
    
    

Tags:    

Similar News