4 నెల‌ల్లో ఏపీ నెంబ‌ర్ ప్లేట్ క‌నిపించొద్దంతే!

Update: 2015-10-15 17:03 GMT
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ స‌ర్కారు కొలువు తీరిన మొద‌ట్లో తీసుకున్న నిర్ణ‌యాల్లో వాహ‌నాల నెంబ‌ర్ ప్లేట్లను మార్చాల‌న్న‌ది ఒక‌టి. ఈ నిర్ణ‌యాన్ని వెంట‌నే అమ‌లు చేయాల‌ని అప్ప‌ట్లో ఉత్త‌ర్వులు జారీ చేయ‌టం.. అదో వివాదంగా మార‌టం.. హైకోర్టుకు వెళ్ల‌టం లాంటివి చాలానే జ‌రిగాయి. అయితే.. ఆ త‌ర్వాత ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని తెలంగాణ స‌ర్కారు తాజాగా  మ‌రోసారి ఈ విష‌య‌పై అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఏపీ పేరుతో ఉన్న వాహ‌న నెంబ‌ర్ ప్లేట్ల‌ను నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో టీఎస్ లోకి మార్చాలంటూ తాజాగా ఆదేశాలుజారీ చేసింది. తెలంగాణ‌లో ఉన్న అన్ని వాహ‌నాల‌కు ఈ మార్పు త‌ప్ప‌నిస‌రి అని పేర్కొంది. తాజా ఆదేశాల ప్ర‌కారం నెంబ‌రు య‌థావిధిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీ స్థానే టీఎస్ రావ‌టం.. జిల్లా కోడ్ లు మాత్ర‌మే మార‌నున్నాయి. మిగిలిన‌వి మాత్రం పాత‌వే ఉంటాయి.

తెలంగాణ వ్యాప్తంగా ల‌క్ష‌ల్లో ఉన్న వాహ‌నాల్ని కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో మార్చ‌టం సాధ్య‌మా అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ స‌ర్కారు తీసుకున్న తాజా నిర్ణ‌యం ఎన్ని చ‌ర్చ‌ల‌కు.. వివాదాల‌కు దారి తీస్తుందో..?
Tags:    

Similar News