ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా మాత్రమే సమయం ఉండటంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇటీవల కాలంలో చురుగ్గా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేస్తున్నారు. అయితే జగన్ పర్యటనలు విమర్శలకు కారణమవుతున్నాయి.
జగన్ పర్యటించే చోట రోడ్లు మొత్తం దిగ్భందించడం, దుకాణాలు మూసివేయించడం, ఇళ్లల్లో నుంచి కూడా ప్రజలు బయటకు రాకుండా బారికేడ్లు అడ్డంగా ఏర్పాటు చేయడం, ప్రతిపక్ష నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలను ఒకటి రెండు రోజుల ముందుగానే అరెస్టులు చేయడం, జగన్ పర్యటనను పురస్కరించుకుని చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడా స్కూళ్లు, కాలేజీలు జరగకుండా వాటి బస్సులను జనాలను తరలించడానికి వాడటం, జగన్ సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తామని మహిళలను బెదిరించడం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఇప్పటికే వీటిపై ప్రధాన మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా నర్సీపట్నం పర్యటన కూడా ప్రజలకు చుక్కలు చూపిందని అంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా చర్యల్లో భాగమంటూ గంటల కొద్దీ అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపేశారని ప్రధాన మీడియా పేర్కొంది. సీఎం వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు కరెంటు నిలిపేశారని వివరించింది. సీఎం జగన్ సభకు జనాలను తరలించడం కోసం వందల బస్సు సర్వీసులు రద్దుచేశారు. దీంతో నర్సీపట్నం, ఉమ్మడి విశాఖ జిల్లా, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రయాణికులు తమ రాకపోకలకు ఇబ్బందులు పడ్డారని సమాచారం. పాడేరు బస్టాండులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకటి, రెండు బస్సు సర్వీసులే అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చిందని ప్రధాన మీడియాలో కథనాలు వచ్చాయి.
జగన్ సభకు చుట్టుపక్కల మండలాలతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి జనాలను తరలించడానికి 700 బస్సు సర్వీసులను రద్దుచేశారని ప్రధాన మీడియా వెల్లడించింది. దీంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారని పేర్కొంది. బస్సుల్లేక పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి బస్‌స్టేషన్లలో గంటల తరబడి ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చిందని ప్రధాన మీడియా తెలిపింది.
మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆందోళనలకు అవకాశం ఉండకూడదని పోలీసులు టీడీపీ, జనసేన నేతలు, వివిధ ప్రజాసంఘాల నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు డి.మధు, రామరాజు, మరికొందరు నాయకులను మాకవరపాలెం, గొలుగొండ పోలీసుస్టేషన్లకు తరలించారని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. నాతవరం, కోటవురట్ల, దేవరాపల్లి, మాడుగుల, కశింకోట మండలాల్లోనూ టీడీపీ నేతలను గృహనిర్బందాలు చేశారని చెబుతున్నారు.
అలాగే సభా ప్రాంగణంలో 108 సిబ్బంది వినతిపత్రాలతో పోలీసులకు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని గొలుగొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.