ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా పేర్కొనే మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడిపై పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా విమర్శలు చేసింది. ఆయన గతంలో పోలీసులపై చేసిన విమర్శలపై ఆ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. తాము రాజకీయాల్లోకి వస్తే పుట్టగతులు ఉండవని గుర్తుచేశారు. రాజకీయాలు చేతకాకపోతే.. ఇంట్లో మూల కూర్చోవాలని, పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని ఓ పోలీస్ అధికారిణి తమ సంఘం తరఫున అగ్గి మీద గుగ్గిలమైంది.
ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత. ఇటీవల నర్సీపట్నంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద పోలీసులు మొహరించారు. ఈ సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులతో అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా దుర్భాషలాడడంతో వారి తరఫున పోలీసుల సంఘం ఆధ్వర్యంలో ఆమె స్పందించి అయ్యన్నపాత్రుడి తీరుపై మండిపడ్డారు. తమకు ఎవరిపై ప్రేమలు ఉండవని చట్ట ప్రకారం మా విధులు మేం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని, ఆయన చెప్పినట్టు తాము తాము ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లోకి వస్తే అయ్యన్నపాత్రుడికి, ఆ పార్టీకి పుట్టగతులే ఉండవని హెచ్చరించారు.
ఆయన రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయిందని ఎద్దేవా చేశారు. అయ్యన్న తీరు చూస్తే ప్రజలకే అసహ్యం వేస్తోందని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ అంటే ఎవరి కింద పనిచేసేది కాదని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారుతాయి కానీ తాము మాత్ర ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రజల రక్షణకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పాటుపడుతున్న డీజీపీ గౌతమ్ సవాంగ్‌పైనే తప్పుగా మాట్లాడడాన్ని ఆమె ఖండించారు. దేశంలోనే అత్యుత్తమంగా పని చేస్తున్న ఏపీ పోలీస్ వ్యవస్థపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతమైతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విధంగా పోలీసుల అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే టీడీపీ నాయకులకు పోలీసులపై విమర్శలు చేయడం సర్వసాధారణమే. గతంలో అనంతపురము జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను తీవ్ర దుర్భాషలాడి ఆ తర్వాత ఓ పోలీస్ అధికారితో చాలెంజ్ లు చేసుకుని ఇప్పుడు ఏకంగా ఆయన చేతిలో ఘోరంగా పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఆ పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్న విషయాన్ని టీడీపీ నాయకులకు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుందని ప్రజలు సూచిస్తున్నారు. పోలీసులను ఎందుకు గెలకడమని హితవు పలుకుతున్నారు.