జగన్ సర్కారుకు శాపంగా మారిన ఏపీ పోలీసులు

Update: 2022-12-08 03:29 GMT
జగన్ సర్కారుకు ఆయుధమని పోలీసుల గురించి గొప్పలు చెప్పుకునే అధికార పార్టీ నేతలు.. ఇటీవల కాలంలో వారి కారణంగా తమ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తాము చెప్పినట్లుగా పోలీసుల చేత పని చేయించుకునే విషయంలో సక్సెస్ కాగా.. ఇటీవల కాలంలో మాత్రం తప్పుల మీద తప్పులు దొర్లుతున్నట్లుగా చెబుతున్నారు. తొలినాళ్లలో పోలీసుల తీరుకు.. ఇప్పటికి పొంతన లేదన్న మాట వినిపిస్తోంది.

విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభ రసాభాసాగా మారటంలో పోలీసుల పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోకాకుండా స్టేడియంలో సభను నిర్వహిస్తే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందన్నది వైసీపీ ఆలోచన. సభకు వచ్చిన జనాభాను హైలెట్ చేసేందుకు సాయం చేస్తుందని భావించారు. అందుకు భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాదాపు 80 వేలకు పైగా సభకు వస్తారని అంచనా వేశారు.

అయితే.. నేతల మధ్య సమన్వయ లోపం.. సభకు యాభై వేల మందికి మించి రాలేదన్న మాట కొందరి నోట వినిపిస్తుంటే.. నలభై వేల కంటే తక్కువే వచ్చారని మరికొందరు చెబుతున్నారు. ఉదయాన్నే సభకు రావటం.. ముఖ్యమంత్రి కోసం దాదాపు మూడు గంటల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఉదయమే ఇంటి నుంచి బయలుదేరి వచ్చిన నేపథ్యంలో.. పలువురికి బాత్రూం సమస్య ఎదురైంది.

ఇలాంటి సమయాల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన పోలీసులు.. బయటకు వెళతామన్న వారిని వెళ్లనీయకుండా అడ్డుకోవటం ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలాంటి సభలకు అభిమానంతో వస్తారు. లేదంటే.. ఏదో ొక కారణంగా వస్తారు. అలాంటప్పుడు వారిని సున్నితంగా డీల్ చేయాల్సింది పోయి.. బాత్రూంకు కూడా వెళ్లేందుకు వీల్లేదని.. సీఎం స్పీచ్ అయ్యే వరకు బయటకు పంపటం సాధ్యం కాదని చెప్పట.. ఈ విషయంపై సభకువచ్చిన వారికి ఆగ్రహాన్ని కలిగించింది. సభలో ఉండాలా? వద్దా? అన్నది తమ ఇష్టమని.. ఇలా పోలీసులు అడ్డుకుంటు ఒప్పుకునేది లేదన్నట్లుగా తయారైంది.

చూస్తుండగానే.. పోలీసుల తీరుతో విసిగిన పలువురు.. అసలు సభలో ఎందుకు ఉండాలన్న కోపాన్ని ప్రదర్శిస్తూ గోడలు దూకి బయటకు పరుగులు తీశారు. ఇలాంటి సమయాల్లో మాస్ హిస్టీరియా కీ రోల్ గా మారుతుంది.

తాజా సభలోనూ అదే జరిగింది. అసలు జరిగింది ఇదైతే.. ప్రచారం మరోలా జరగటంతో వైసీపీ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. దీనికి తోడు వీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియా.. వాట్సాప్ లో హడావుడి చేయటం మొదలైంది. మొత్తంగా చూస్తే.. పోలీసుల తీరు జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇకపై జరిగే సభల విషయంలో అయినా ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News