విధి నిర్వహణలో బాగంగా తాము చేసిన పనిని రాజకీయ పార్టీలు విమర్శించటం.. తమపై ఆరోపణలు గుప్పించటంతో ఏపీ పోలీస్ సంక్షేమ సంఘం రాజకీయ పార్టీలపై విమర్శలు చేసింది.
చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌పై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఏపీలోని విపక్షాలు.. తమిళనాడులోని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పోలీస్ సంఘం స్పందించింది. ఎర్రచందనం దొంగలకు మద్ధతు ఇస్తున్న వారే అడవులకు పంపారా? అని సదరు సంఘం ప్రశ్నించింది.
ఎర్రచందనం దొంగల కులం.. మతం.. ప్రాంతాల గురించి రాజకీయ పార్టీలకు ఎలా తెలుసని.. ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే రార్థాంతం చేస్తున్నారని విమర్శించారు. అధికారులపై దాడులు జరిగినప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. మొత్తానికి తమ పని తీరుపై వస్తున్న విమర్శలకు జవాబులు చెప్పకుండా.. రాజకీయ పార్టీల తీరును ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేయటం కొత్త పరిణామంగా చెబుతున్నారు.