వైసీపీలో ఒక కొత్త చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎంతమందికి టికెట్లు కట్ అవుతాయన్నదే ఆ చర్చ. గడప గడపకు ఎమ్మెల్యేల పనితీరు ఒక క్రెడిటేరియాగా ఉన్నా కూడా దాంతో పాటుగా మరో కొలమానాన్ని కూడా అధినాయకత్వం పరిశీలిస్తోంది అని అంటున్నారు. గత ఎన్నికల్లో అయిదు వందల నుంచి వేయి లోపు ఓట్ల మెజారిటీతో గెలిచిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదు అన్నదే ఆ చర్చ.
వీరంతా చాలా తక్కువ మార్జిన్ తో గెలిచారు. అంతే కాదు ప్రత్యర్ధులు కూడా గట్టిగా ఉన్నారు. జగన్ వేవ్ కలిసి రాబట్టి వీరి విజయం సాధ్యమైంది. ఇక అయిదేళ్ల తరువాత ఎన్నికలకు వెళ్తే ఎటూ యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దాన్ని తట్టుకుని గెలవడం ఈ వేయి ఓట్ల లోపు వారికి చాలా కష్టం అని అంటున్నారు.
అందుకే గడప గడపతో సంబంధం లేకుండా వీరికి టిక్ పెట్టేస్తారు అని చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. అలా కనుక చూసుకుంటే అతి తక్కువ ఓట్లు అంటే కేవలం పాతిక ఓట్లతో ఎమ్మెల్యే అయినా విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ మల్లాది విష్ణుకు వచ్చేసారి టికెట్ దక్కదు అనే చెబుతున్నారు. ఆయన ప్రత్యర్ధిగా టీడీపీ నుంచి బోండా ఉమా ఉన్నారు.
ఆయన ఇప్పటినుంచే రెడీ అయిపోతున్నారు. అదే విధంగా కాపుల ప్రాబల్యం కూడా ఇక్కడ గట్టిగా ఉంటుంది. దాంతో సామాజిక సమీకరణలు రాజకీయ లెక్కలు అన్నీ చూసుకున్నా కూడా ఆయనకు టికెట్ దక్కే సీన్ లేదని అంటున్నారు ఇక గోదావరి జిల్లాలో చూసుకున్న పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అతి తక్కువ ఓట్ల తేడాతో గతంలో గెలిచారు. గోదావరి జిల్లాలలో టీడీపీ ప్రభావం గట్టిగా ఉంటుంది. అయినా గెలిచారు అంటే అది జగన్ వేవ్ మహిమ.
ఈసారి అలాంటి ఆశలు ఉండవు కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ మందికి టికెట్లు దక్కేఅ సీన్ లేదని చెబుతున్నారు. ఉత్తరాంధ్రాలో చూసుకుంటే వైసీపీ 28 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. దాంటో చాలా సీట్లు తెలుగుదేశం కంచుకోటలు ఉన్నాయి. అక్కడ కచ్చితంగా మార్పులు ఉంటాయని, వేయి నుంచి రెండు వేల లోపు కొన్ని చోట్ల మూడు వేల లోపు ఓట్లు తేడాతో గెలిచినా కూడా సీటు చిరిగిపోవడం ఖాయమని అంటున్నారు.
దీంతో తక్కువ ఓట్లతో గతంలో గెలిచి జాక్ పాట్ కొట్టిన ఎమ్మెల్యేలు అంతా ఇపుడు తమకు అదే మైనస్ అవుతోందని తెగ కంగారు పడుతున్నారుట. ఇక పీకే టీం సర్వేలలో సైతం తక్కువ ఓట్లు గతంలో తెచ్చుకున్న వారి నియోజకవర్గాలలో తెలుగుదేశం కంచుకోటలలో సైకిల్ ప్రభావం ఈసారి చాలా ఎక్కువగా ఉంటుందని నివేదికలు ఇవ్వడంతో కచ్చితంగా వారిని మార్చాల్సిందే అని హై కమాండ్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ టికెట్ల విషయంలో వస్తున్న ప్రచారంతో మాత్రం ఎమ్మెల్యేలు దిగాలు పడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.