ఏపీలోని 175 స్థానాల్లో పోలింగ్ శాతాల లెక్క ఇదే

Update: 2019-04-13 08:04 GMT
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి రెండు రోజులైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్.. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ సాగటం తెలిసిందే. వేలాది ఈవీఎంలు మొరాయించినా.. విసుగు చెందని ఏపీ ప్రజలు గంటల కొద్దీ టైం ఓట్లు వేసేందుకు క్యూలోనే ఉండిపోయారు. అన్నింటికంటే విచిత్రం ఏమంటే.. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలో ఉన్న వారు పక్కరోజు తెల్లవారుజామున 5 గంటల వరకూ క్యూలోనే ఉన్నారంటే వారి సహనం.. ఎన్నికల విషయంలో వారికున్న ఆసక్తి ఎంతన్న విషయం తాజా ఎన్నికలతో స్పష్టమైందని చెప్పాలి.

హైదరాబాద్ లో ప్రజలు ఓటు వేయటానికి అడుగు తీసి బయటకు రావటానికి ఇష్టపడకపోతే.. ఏపీలోని ప్రజలు పోలింగ్ రోజు మొత్తాన్ని పోలింగ్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణాలు చేయటానికే సరిపోయిన పరిస్థితి. వాస్తవంగా చూస్తే.. ఒకవేళ ఈవీఎంలు సరిగా పని చేసి ఉంటే.. ఏపీలో పోలింగ్ 85 శాతానికి మించి నమోదై ఉండేదన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. 2014లో నమోదైన పోలింగ్ కు తాజాగా నమోదైన పోలింగ్ కు మధ్య తేడా ఏంత? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా.. ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ఆధారంగా తయారు చేసిన ఇమేజ్ ను చూస్తే.. ఏపీ మొత్తంలో నమోదైన పోలింగ్ శాతాలు ఇట్టే అర్థమైపోతాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఒక లుక్ వేయండి.


Tags:    

Similar News