విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 12 విదేశీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో పాటు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలను లోన్‌గా ఇస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. పెట్టుబడుల సదస్సులో ఈ మేరకు ఆంధ్రాబ్యాంక్ అధికారులు ప్రకటించారు.
మరోవైపు పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఆయా కంపెనీలు ఇవి... కోల్గేట్ పామోలీవ్ రూ.450 కోట్లు, థర్మాక్స్ రూ.200 కోట్లు, ఇసూజీ రూ.230 కోట్లు, విక్రమ్ సోలార్ రూ.220 కోట్లు, బచావట్ ఎంటర్‌ప్రైజస్ రూ.25 కోట్లు, ఎరో ఫిస్టన్ రూ.20 కోట్లు, న్యూక్లియస్ రూ.20 కోట్లు, వాల్‌మార్ట్ రూ.10 కోట్లు, ఎంఎస్‌ఆర్ రూ.10 కోట్లు, ఎంఎస్‌ఆర్ గార్మెంట్స్ రూ.10 కోట్లు, యూఎన్‌పీ రూ.20 కోట్లు, రెడ్‌స్టార్ ప్లాస్టిక్ రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సీఐఐ సదస్సులో ఇప్పటి వరకు రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థ పాలనపై నమ్మకముంచిన ప్రముఖ కంపెనీలు పలు రంగాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సీఐఐ సదస్సు తాము ఊహించినదానికన్నా ఎక్కువగా విజయవంతమైందని చెప్పారు. సదస్సు ద్వారా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశామని, అయితే తొలిరోజే ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు.