ఏపీలో భారీగా క‌రోనా టెస్టులు.. జిల్లాల‌వారీగా ఎన్నెన్నో

Update: 2020-04-25 14:00 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైర‌స్ అదుపులోకి రాలేదు. తెలంగాణ‌లో కొంత త‌గ్గుముఖం ప‌ట్టినా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా వైర‌స్ కంట్రోల్ కావ‌డం లేదు. తాజాగా శ‌నివారం క‌రోనా కేసులు వెయ్యి దాటాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,016 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అయితే క‌రోనా టెస్టుల‌పై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌స్తున్న స‌మ‌యంలో ఈ సంద‌ర్భంగా క‌రోనా నివార‌ణ‌కు తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డించింది.

క‌రోనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో దాని నివార‌ణ‌కు.. ఆ వైర‌స్ బాధితుల‌ను గుర్తించేందుకు రాష్ట్ర‌వ్యాప్తంగా ఏకంగా 61,266 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు వైద్యారోగ్య శాఖ‌ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా అత్య‌ధిక ప‌రీక్ష‌లు చేసిన రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిలిచింద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా జిల్లాల వారీగా చేసిన ప‌రీక్ష‌ల వివ‌రాలు వెల్ల‌డించింది.

శ్రీకాకుళం 3,188
విజ‌య‌న‌గ‌రం 1,806
విశాఖ‌ప‌ట్ట‌ణం 8,141
తూర్పుగోదావ‌రి 5,547
ప‌శ్చిమ‌గోదావ‌రి 4,272
కృష్ణా 5,275
గుంటూరు 6,541
ప్ర‌కాశం 2,961
నెల్లూరు 5,003
చిత్తూరు 5,458
క‌డ‌ప 4,820
అనంత‌పుర‌ము 3,282
క‌ర్నూలు 4,972

మొత్తం 61,266
Tags:    

Similar News