ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కీలకమైన జిల్లాలుగా గోదావరి జిల్లాలను చెప్పుకుంటారు. అది ఒక సెంటిమెంట్ గా కూడా ఉంది. గోదావరి ప్రజలలో వచ్చే మార్పు ఏపీ అంతటా కనిపిస్తుంది అని అంటారు. అక్కడ జనం నాడి పట్టుకుంటే గెలుపు గుట్టు తెలుస్తుంది. అందుకే చంద్రబాబునాయుడు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన తన సభలకు వచ్చే జనం విషయంలో ఆరా తీస్తున్నారు. వారి మనసులో ఏముంది అని ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారు. అలాగే జనాలు తమ పార్టీ మీద ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు అన్నది కూడా విచారణ చేస్తున్నారు. ఇక పార్టీ నాయకుల పనితీరు మీద కూడా ఆయన నిఘా పెట్టి మరీ వాస్తవాలు వెలికి తీస్తున్నారు.
ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలలో చంద్రబాబు టూర్ కి జనాలు వెల్లువలా వచ్చారు. నిన్న విజయరాయి అయినా నేడు కొయ్యలగూడెం అయినా జనాలు తండోపతండాలుగా వచ్చారు. చిత్రమేంటి అంటే చంద్రబాబు రాక ఆలస్యం అయినా గంటల కొలదీ వారు వేచి చూడడం కనిపిస్తోంది. అంటే పూర్తిగా జనాలు టీడీపీ వైపు టర్న్ అయ్యారు అన్న సంకేతాలు కనిపిస్తునాయని తెలుగుదేశం నాయకులు సంబరపడుతున్నారు.
మరో వైపు గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం ఎంత ఉంది అన్న అంచనాను కూడా టీడీపీ కడుతోంది. జనసేనకు హార్డ్ కోర్ డిస్ట్రిక్ట్స్ గా గోదావరి జిల్లాలను చూస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం తాము ఒంటరిగా బరిలోకి దిగినా జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్న లెక్కలు కూడా వేసుకుంటోంది. ఏపీలో చూస్తే గోదావరి జిల్లాలలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ లో ఇవి మూడవ వంతు అన్న మాట.
ఇక్కడ కనుక జెండా పాతేస్తే మిగిలిన పని సులువు అవుతుంది అన్నదే టీడీపీ స్ట్రాటజీగా ఉంది అంటున్నారు. ఇక గోదావరి జిల్లాలలో వైసీపీ పట్ల పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది అని ఆ పార్టీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో ఒక్క చాన్స్ అని జగన్ అడిగితే టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాలలో సైతం ఫ్యాన్ గిర్రున తిరిగింది. దాంతో గోదావరి జిల్లాల నుంచి అయిదంటే అయిదు సీట్లు మాత్రమే టీడీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది.
ఈసారి తాము పూర్తిగా లాభపడతామని, కచ్చితంగా తొంబై శాతం పైగా సీట్లు గెలుచుకుంటాని తెలుగుదేశం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జనసేనతో పొత్తులు ఉంటే నూరు శాతం ఈ జిల్లాల నుంచి కూటమికి ఫలితాలు వస్తాయని కూడా విశ్లేషించుకుంటున్నారు.
అయితే టీడీపీ వాదన ఎలా ఉంది అంటే పొత్తులు ఉన్నా లేకపోయినా సింగిల్ హ్యాండ్ తోనే తాము అత్యధిక సీట్లు గెలవాలని. చంద్రబాబు టూర్లకు జనాలు బ్రహ్మరధం పడుతూండడంతో తమకు తిరుగులేదన్న ధీమా అయితే వారిలో కనిపిస్తోంది. గోదావరి జిల్లాలు మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటునాయి. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుంది అని సైకిల్ పార్టీలో ఆశాభావం వ్యక్తం అవుతోంది. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పునాదులు బలంగా ఉండడంతో పాటు క్యాడర్ బేస్డ్ పార్టీ కావడంతో టీడీపీకి గోదావరి జిల్లాలు సంపూర్ణ విజయం చేకూరుస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దాంతో గోదావరి రాదారి మీద సైకిల్ జోరు చేయడం ఖాయమని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.