ఏపీకి అప్పు తెగబడి ఇస్తున్న ఆర్బీఐ

Update: 2020-06-03 11:10 GMT
అప్పుల కుప్పతో సీఎం జగన్ ఏపీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు. భారీ సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ నిర్వహణ.. ఖర్చు కోసం అప్పులు చేయని పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఎదురవుతోంది. చంద్రబాబు ఇప్పటికే 2 లక్షలకోట్లకు పైగా అప్పులు మిగల్చగా.. లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ ఇప్పుడు మరిన్ని అప్పులు చేయడం మినహా మరో దారి లేకుండా పోయింది.

ఇప్పటికే సీఎం జగన్ నవరత్నాలు, ప్రాజెక్టులు ప్రకటించారు. చాలా మందికి వరాలిచ్చారు. వాటన్నింటి కోసం ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.2వేల కోట్లు సమీకరించింది. ఇందులో రూ.1000 కోట్లు 10 ఏళ్ల కాలపరిమితితో 6.58శాతానికి తీసుకుంది. మరో రూ.1000 కోట్లు నాలుగేళ్ల కాలపరిమితికి 5.45శాతం చొప్పున వడ్డీకి తీసుకుంది.

కాగా ఇప్పటికే జగన్ ప్రభుత్వం కరోనా-లాక్ డౌన్ సంక్షోభం వేళ కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి రూ.12వేల కోట్ల వరకు రుణాలు తీసుకుంది. ఇప్పుడు తాజాగా మరో 2వేల కోట్ల రుణాలను తీసుకోవడం గమనార్హం.
Tags:    

Similar News