ఏపీ అప్డేట్: వైసీపీ హవా.. అమరావతిలోనూ వైసీపీనే.. గుంటూరు కైవసం.. విజయవాడలో ఆధిక్యం

Update: 2021-03-14 07:55 GMT
ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ హవా ప్రభజనం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ పోరులో సత్తా చాటుతున్న వైసీపీ.. అమరావతిని రాజధానిని కాదని మూడు రాజధానులు చేస్తున్నా కూడా ప్రజలు వైసీపీ వైపు నిలవడమే విశేషంగా మారింది.  రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగడం సంచలనమైంది.

వైసీపీ దూసుకుపోతోంది. గుంటూరు,చిత్తూరు,తిరుపతి,ఒంగోలు కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది. తాజాగా విజయవాడ, గుంటూరు మున్సిపల్‌ కార్పోరేషన్లపై వైసీపీ ఏకపక్షంగా విజయాలు సాధిస్తోంది. దీంతో వైసీపీ సర్కారు మూడు రాజధానుల వికేంద్రీకరణకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా దీన్ని చెప్పుకుంటోంది.  గుంటూరు కార్పోరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 50 స్ధానాల్లో వైసీపీ ఏపక్షంగా 37 స్ధానాలు కైవసం చేసుకుంది. విపక్ష టీడీపీ కేవలం 6 సీట్లకే పరిమితం అయింది. జనసేన 2 స్ధానాల్లో విజయం సాధించింది. ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. ఇక్కడ వైసీపీ తొలిరౌండ్‌ నుంచీ ఆధిపత్యం ప్రదర్శించింది. పోటీలో జనసేన-బీజేపీ కూటమి కూడా ఉండటంతో పలుచోట్ల ఓట్ల చీలిక కూడా జరిగినట్లు భావిస్తున్నారు

అటు విజయవాడ కార్పోరేషన్‌లోనూ వైసీపీ ఆదిక్యం ప్రదర్శిస్తోంది. ఇక్కడ మొత్తం 64 స్ధానాలు ఉండగా... వైసీపీ ఇప్పటికే 7 స్ధానాల్లో విజయం సాధించింది. మరో పది స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ మాత్రం మూడు డివిజన్లు గెల్చుకుంది. కేవలం 9, 11, 45 డివిజన్లను టీడీపీ కైవసం చేసుకుంది. పోస్టల్‌ ఓట్లలో వెనుకబడిన టీడీపీ మేయర్ అభ్యర్ధిని కేశినేని శ్వేత అసలు ఓట్లలో మాత్రం ఆధిక్యం సాధించి విజయాన్ని అందుకున్నారు. ఫలితాల సరళిని బట్టి చూస్తుంటే విజయవాడ కార్పోరేషన్‌ను కూడా వైసీపీ సునాయాసంగా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
 
అమరావతి ప్రాంతంలో ఉన్న గుంటూరు కార్పోరేషన్ విజయంపై ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో వినుకొండ, రేపల్లె, సత్తెనపల్లి వంటి మున్సిపాలిటీలనూ వైసీపీ కైవసం చేసుకుంది.
 
అమరావతి పరిధిలో వైసీపీ సాధిస్తున్న విజయాలపై ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.. వైసీపీ సర్కారు చేపట్టిన వికేంద్రీకరణకు అమరావతి ప్రజలు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యనించారు. టీడీపీ మాత్రం కృత్రిమ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఇంకా రాజధాని రాజకీయాలు చేస్తోందని సజ్జల విమర్శించారు.

తిరుపతి కార్పొరేషన్ లో వైసీపీ హవా కొనసాగింది. టీడీపీ ఒకటే సీటు గెలవగా.. జనసేన-బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతైంది.

విజయవాడలో 20 స్థానాలకు ఓట్లు లెక్కింపు జరగగా వైసీపీ 15 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ 5 చోట్ల గెలిచింది.

పశ్చిమ గోదావరిలో మున్సిపాలిటీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు మున్సిపాలిటీలను గెలుచుకుంది.

చీరాల మున్సిపాలిటీ వైసీపీ కైవసం.సత్తా చాటిన రెబల్ అభ్యర్థులు. గెలిచిన రెబల్ అభ్యర్థుల్లో ఎక్కువగా ఆమంచి వర్గంవారే ఉండటం విశేషం
 
హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలక్రిష్ణకు షాక్ తగిలింది.. అక్కడ 18వార్డుల్లో వైసీపీ ముందంజలో ఉంది.
Tags:    

Similar News