​​తెలంగాణ​కు ఇది హాట్ న్యూసే !

Update: 2015-11-09 13:01 GMT
తెలంగాణ‌లో పెట్టుబ‌డులకు అంత‌ర్జాతీయ సంస్థ ముందుకు వ‌చ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో త్వరలోనే బోయింగ్ కంపెనీ త‌న హెలీకాప్ట‌ర్ల త‌యారీని ప్రారంభించ‌నుంది. ఈ విష‌యాన్ని రాష్ర్ట ఐటీ - పంచాయ‌తీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ విమాన రంగ సంస్థ బోయింగ్ - దేశంలోనే దిగ్గ‌జ కంపెనీ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్‌ లు హెలికాప్టర్లను తయారీ కేంద్రాన్ని హైద‌రాబాద్‌ లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు. రక్షణ - విమానయాన రంగంలో వాడే ఏహెచ్-64 రకానికి చెందిన అపాచీ హెలికాప్టర్లు తయారు కానున్నాయని ఆయ‌న వివ‌రించారు.

తెలంగాణ-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ల మ‌ధ్య పెట్ట‌బ‌డుల విష‌యంలో పెద్ద ఎత్తున పోటీ నెల‌కొన్న స‌మ‌యంలో బోయింగ్‌-టాటాల సంయుక్త వెంచ‌ర్ తెలంగాణ‌లో ఏర్పాటు కావ‌డం ఆ రాష్ర్టానికి పెద్ద ఎత్తున భ‌రోసాను ఇచ్చే చ‌ర్య అని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఐటీ - ఫార్మా హ‌బ్‌ గా ఉన్న తెలంగాణ తాజాగా జాయింట్ వెంచ‌ర్‌ తో విమాన‌యాన రంగంలో త‌న‌దైన శైలిలో ముందుకువెళ్లే అవ‌కాశాలు ఉన్నట్లు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News