విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్, ఆపార్టీ నేతలను ఎయిర్ పోర్టు నుంచే పోలీసులు వెనక్కి పంపించేశారు. జగన్ తో పాటు మరో ఆరుగురు వైకాపా నేతలను బలవంతంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఎక్కించారు.
పవన్ కల్యాణ్: "రేపు ఉదయం 9 - 10 గంటల మధ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను!
రాం గోపాల్ వర్మ::"నిజమైన యోధుడు చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని సురక్షిత ప్రదేశంలో ఉండడు.. కత్తి పట్టుకుని కధనరంగంలోకి దూకుతాడు"
"ఎంతో ఉత్సాహపరిచిన వ్యక్తి దూరంగా ఉన్నాడ్టం ఎంతో నిరాశ పరిచింది. ఆయనే వచ్చుంటే... ఇలా ఫెయిల్ అయ్యేకంటే హిట్ అయ్యేది"
"ఈరోజుకైతే పూర్తిగా ఫెయిల్ అయిపోయినప్పటికీ... తర్వాత ఎలా సూపర్ హిట్ చేయాలనే ప్లాన్ పవన్ కల్యాణ్ రేపు చెబుతాడు"
"తెలుగు వారు తమిళులను చూసి స్పూర్తి పొందడం మాత్రమే కాదు, నేర్చుకోవాలి కూడా. అదేమిటనేది పవన్ కళ్యాణ్ నేర్పుతాడు.. జై హింద్"
రాం గోపాల్ వర్మ: నేటి ప్రత్యేక హోదా నిరసన విషయంలో వైఎస్ జగన్ నిజమైన సంకల్పాన్ని, ధైర్యాన్ని చూపించారు... అతనికి అభినందనలు!
రాం గోపాల్ వర్మ: "పవన్ కల్యాణ్ ఇప్పటికీ ట్విట్టర్ లోనే ఎందుకు స్పందిస్తున్నారు.. కదనరంగంలోకి ఎందుకు దిగడం లేదు.. రాజు రంగంలోకి దిగకుండా యుద్దంలో గెలవడమెలా"? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు రాం గోపాల్ వర్మ!
ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియని వారు పోలీసులు ఎలా అయ్యారయ్యా అంటూ జగన్ ప్రశ్నించారు. టిక్కెట్ కొనుక్కుని విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడిని డొమెస్టిక్ అరైవల్ లాంజ్ లోకి ప్రవేశించకుండా ఆపే హక్కు మీకెవరిచ్చారని విమాన సిబ్బందిపై జగన్ ఫైరయ్యారు. ఐడీ కార్డులు లేని వ్యక్తులు పోలీసులమని చెప్పి విమానాశ్రయంలో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. అసలు మమ్మల్ని ఏమి చేయాలనుకుంటున్నారు... అసలు మమ్మల్ని ఇక్కడ ఏమి చేయామంటారు.. అంటూ జగన్ విమానాశ్రయ సిబ్బందిపై నిప్పులు చెరిగారు. రెండే రెండు సంవత్సరాలు... తర్వాత అన్నీ గుర్తుపెట్టుకుంటానని జగన్ హెచ్చరించారు.
అంబటి రాంబాబు:: విమానం దిగిన దగ్గరనుంచి కనీసం ప్రయాణికులు కూర్చునే లాంజ్ లోకి కూడా మమ్మల్ని వెళ్లనివ్వడంలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎయిర్ పోర్ట్ పరిధిలోకి రాష్ట్ర పోలీసులు ఎలా వచ్చారనేది అర్ధం కావడం లేదు. ఇప్పటికీ మమ్మల్ని రన్ వే పైనే ఆపేశారు. ఎయిర్ పోర్ట్ బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తమకు తెలియదు.. క్యాండిల్స్ ర్యాలీ వద్దకు అనుమతిస్తారా లేదా అన్నది తర్వాత విషయం. కనీసం విమానాశ్రయం లాంజ్ లోకి కూడా పంపకపోవడం నిరంకుశత్వం... అని వైకాపా నేత అంబటి రాంబాబు స్పందించారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాటం కోసం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ ను విమానాశ్రయం రన్ వేపైనే పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ఆయన రన్ వేపై బైఠాయించారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ పోరాడుతున్న యువతకు మద్దతుగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది.
పోలీసులు ముందుగానే జగన్ కాన్వాయ్ ని అడ్డగించి, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే!
గాలి ముద్దుకృష్ణమ నాయుడు: ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం వైఎస్ జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నా వాటిని అడ్డుకోవడమే ఆయన లక్ష్యం. ఏ ఒక్కరూ ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా అర్ధం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలి.
విశాఖలో ఏపీ యువత తలపెట్టిన ప్రత్యేక హోదా మౌన నిరసనకు తమ సహకారంగా అక్కినేని అఖిల్ యువత కరపత్రాలు, వాటర్ పాకెట్లను పంచారు.
పవన్ కళ్యాణ్:: ప్రత్యేక హోదా కోసం పోరాట పటిమ చూపిన తెలుగు ప్రజలకు, ముఖ్యంగా యువతకి నా జేజేలు. నిన్న, ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరినీ పోలీసులు బేషరతుగా తక్షణం విడుదల చేయాలి.. జై హింద్!
పవన్ కళ్యాణ్:: యువత పోరాట స్పూర్తిని "సుజనా చౌదరి గారు" పందులు పందాలు తో పోల్చడం చాలా భాదాకరం.. ఇంక మీరు నోరు జారే కొద్ది యువతని రెచ్చగొట్టటమే.. సరే అలాగే కానివ్వండి.. ఆంధ్రలోని ప్రతి యువకుడూ, యువతీ మనల్ని వెటకారం చేసే గల్లీ స్థాయి నాయకుడి నుంచి ఢిల్లీ స్థాయి నాయకుడు దాకా ప్రతీ ఒక్కరినీ గుర్తుపెట్టుకోండి" - అని పవన్ ట్విట్టర్ లో స్పందించారు.
Full View
మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇచినా సరిపోదన్నది మీరే.. ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదు అద్భుతాలు చేయటానికి అన్నదీ మీరె.. హోదాని మించింది ప్యాకేజ్ అని చప్పట్లు కొట్టిందీ మీరే.. ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తామన్నదీ మీరే.. అసలు చట్టబద్దత అవసరం లేదంటుందీ మీరే.. మీరు ఇన్ని అన్నప్పుడు మా ప్రజలు విన్నారు.. మరి మా ప్రజల ఆక్రోశం, ఆవేదన కనీసం ఒక్కసారి చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలా?
పాలకులు, పాలక వర్గాలు ఏభై ఏళ్లుగ వారి వారి పార్టీల ప్రయోజనాలకోసం చేసిన స్వార్ధపూరిత కుట్రలకి, ఏ తప్పూ చేయని ప్రజలు ద్వేషంతో విడిపోవాల్సి వచ్చింది. ఆ నిర్లక్ష్య పూరిత విభజన పద్దతికి వచ్చిన నష్టాలని అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా గత మూడేళ్లుగా మళ్లీ ఇలాంటి ధోరణి అవలంభిస్తూ, మా ప్రజలని ఇంకెంత నిరాశ, నిస్పృహలోకి నెడతారు?
ఇప్పుడు ఆంధ్రులు చేస్తున్న పోరాటం వల్ల వెంటనే న్యాయం జరుగుతుందా లేదా అనేకంటే.. భవిష్యత్తు తరాల్లో ఇలాంటి నీచ రాజకీయాలు చేయాలంటే భయపడాలి. జనసేన పోరాటం తాలూకు అంతిమలక్ష్యం అదే.
గుణశేఖర్:: "సైలంట్ ప్రొటెస్ట్ ఈస్ బెటర్ దేన్ వైలెన్స్" అంటూ స్పందించారు డైరెక్టర్ గుణశేఖర్. రేపు ఏపీ యువత విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన నిరసన పై స్పందించిన గుణశేఖర్ తన మద్దుతు ప్రకటించారు.
హీరో రామ్ : "డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. అడగట్లేదు.. అడుక్కోవట్లేదు.. ఎదురుచూస్తున్నాం.. లెస్ నాయిస్ = మోర్ సౌండ్" అంటూ ట్విట్టర్ లో స్పందించారు హీరో రాం. రిపబ్లిక్ డే రోజున విశాఖ ఆర్కే బీచ్ లో ఏపీ యువత చేపట్టబోయే నిరసనపై రాం ఇలా స్పందించారు.
సాయిధరం తేజ్:: ప్రియమైన ఆంధ్రప్రదేశ్ యువతకు విన్నపం...
1. కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్ధానం కోసం ఈ పోరాటం
2. దయచేసి పోలీసులకు సహకరించండి. వారి రూల్స్ ప్రకారం నడుచుకోండి. ఒక శాంతియుత నిరసనకు సహకరించండి.
3. దయచేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంశాలకు పాల్పడకండి.
4. ఈ నిరసన కార్యక్రమంలో ఎవరైన ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా.. ఆ సంఘటనలను వీడియో తీసి పోలీసు అధికారులకు కాని, మీడియాకు కానీ ఇవ్వండి.
5. అన్నింటికంటే మీ క్షేమం ముఖ్యం. కార్యక్రమం అనంతరం మీరు ఇంటికి క్షేమంగా తిరిగి వెల్లండి. మీ కుటుంబం మీకోసం ఎదురుచూస్తుంది.. జై హింద్..
అంటూ ట్విట్టర్ లో రేపటి కార్యక్రమానికి సంబందించి ఏపీ యువతకు హీరో సాయిధరం తేజ్ సూచనలు చేశారు.
శివాజీ : అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా తిననివ్వదు అన్నట్లుంది ప్రస్తుతం ఏపీలో పరిస్థితి.. ఈ పోరాటం చంద్రబాబుకి వ్యతిరేకంగా చేస్తున్నారని ఎందుకనుకుంటున్నారో అర్ధం కావడం లేదు.. ఇది చంద్రబాబుపై పోరాటం కాదు, భావి ఆంధ్రుల జీవన్మరణ సమస్య. ప్రత్యేక హోదా అనేది ఏపీలో ఉన్న ప్రతి బిడ్డ హక్కు. తమ హక్కును పొందలేకపోతున్నారనే నిరసనను వ్యక్త పరచడానికి ఆర్కే బీచ్ కి వస్తే మీకేమిటి ప్రాబ్లం. నిరసన తెలియజేసే హక్కును మీరు కాదంటే... గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసివి ఏమిటి? మీరు చేస్తే మంచి పని, జనాలు చేస్తే అభివృద్ధిని అడ్డుకునే చర్య? ఒకప్పుడు మీరు రైతు వ్యతిరేకి అనే ముద్ర వేసుకున్నారు, ఒకప్పుడు మీరు ఉద్యోగ వ్యతిరేకి అనే ముద్రవేసుకున్నారు.. ఇప్పుడు యువత వ్యతిరేకి అనే ముద్ర వేసుకోవద్దు దయచేసి. రేపు జరిగే ఆత్మగూరవ పోరాటానికి మద్దతు తెలపండి. హై హింద్.. జై ఆంధ్రప్రదేశ్.. జై ఆంధ్రప్రదేశ్ యువత" అంటూ తాజాగా ఒక వీడియోలో స్పందించారు హీరో శివాజి!
https://www.facebook.com/ActorSivaji/videos/1572195669475559/
రానా దగ్గుబాటి:: "సైలంట్ ప్రొటెస్ట్ ఈస్ బెటర్ దేన్ వైలెన్స్" అంటూ స్పందించారు రానా దగ్గుబాటి. రేపు విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన నిరసన పై స్పందించిన రానా... అహింసా పద్దతిలో, మౌనంగా నిరసన తెలపడం ఎంతో గొప్ప విషయమని అన్నారు.
రాజమౌళి:: "సైలంట్ ప్రొటెస్ట్ ఈజ్ బెటర్ దేన్ వైలెన్స్" ను తాను గౌరవిస్తానని ప్రకటించారు రాజమౌళి. సమైఖ్యాంధ్ర నిరసన కార్యక్రమంపై స్పందించిన రాజమౌళి... పార్లమెంట్ సాక్షిగా అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన మాటకు గౌరవం దక్కాలని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ ఉద్యమించిన నటుడు శివాజీ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను అప్ లౌడ్ చేశారు. ఈ వీడియో ప్రారంభంలో... తానసలు ఈ వీడియో ఎందుకు పెడుతుందీ చెప్పిన శివాజీ... ప్రత్యేక హోదాకీ, ప్రత్యేక ప్యాకేజీకి ఉన్న తేడాని సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు.
"అందరికీ ప్రత్యేక హోదా, ప్యాకేజీకి తేడా ఏమిటి అనే డౌట్ ఉందని నా అభిప్రాయం. ప్రత్యేక హోదా గురించి నేనేమీ వ్యక్తిగతంగా విధివిధానాలేమీ రూపొందించలేదు. కేంద్ర బడ్జెట్ లో ప్రణాళికా వ్యయం ఏదైతే క్యాష్ కు సంబంధించి ఉంటుందో దాంట్లో నుంచి భారత ప్రభుత్వానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇందులో నుంచి 30 శాతం నిధులను ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు పంపించాలి. అంటే సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలను హోదా ఉన్న రాష్ట్రాలకు పంచాలి డిఫాల్టుగా బ్యాంకు అకౌంటులోకి చేరుతాయి. ఈ వాటాతో మన రాష్ట్రానికి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు వస్తాయి.
అలాగే విభజన తర్వాత కేంద్రం నుంచి తీసుకున్న, ఇతర అప్పులు కేంద్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే రాష్ట్రం అప్పులు తెచ్చుకుంటే డెబ్బై శాతం కట్టవలసిన పని లేదు, అదే ప్రత్యేక హోదా వస్తే 90 శాతం కట్టే పని ఉండదు. పెళ్లి చేసుకుంటే.. భార్యను బిడ్డను ఎంత బాధ్యతగా చూసుకోవాలో అలాంటిది హోదా.. ఉంపుడు గత్తెను ఉంచుకుంటే ఇస్తే పడి ఉంటుందన్నట్లు ప్యాకేజీ. చంద్రబాబు నాయుడుకు ఇవన్నీ తెలుసు, ఇన్ని లాభాలు ఉన్న హోదాను ఎందుకు వదులుకోవాలో బాబు చెప్పాలి. వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది" అంటూ మొదలైన విషయాలను హీరో శివాజ్ తన వీడియో ద్వారా వెల్లడించారు. కాగా, ఈ వీడియో 2016 సెప్టెంబరు 7న విడుదల చేసింది అయినా... అదే విషయాన్ని మరోసారి ఫేస్ బుక్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు శివాజి!
Full View
ప్రజాస్వామ్య దేశంలో ఎవరి వాదన వారు చెప్పుకునే హక్కు ఉంది, రేపటి నిరసనలకు ఎవరు వస్తారో ఎవరు నడిపిస్తారో అందరూ చూస్తారు.. రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది.. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇంత తక్కువ సమయంలో ఇన్నేసి ఎక్కువ ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేసింది లేదు. ఈ నెల 27 - 28 తేదీల్లో రాష్ట్రంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు సహకరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను" అంటూ విశాఖ ఆర్కే బీచ్ లో జరగబోయే నిరసన పై కేంద్రమంత్రి వెంకయ్య స్పందించారు.
Full View
కళా వెంకట్రావు:: ఏ ఆరు మాసాలకో నిద్రల్లో తెలివస్తుంటే, కుంభకర్ణుడిలా వచ్చి అభివృద్ధి జరగనీయకుండా జగన్ అడ్డుకుంటున్నారు. ఏ ఉద్దేశ్యంతో విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే నిరసనకు వస్తున్నారు? కేవలం అభివృద్ధిని అడ్డుకోవడానికే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు" అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు.
ఏపీ యువజన జేఏసీ:: ప్రత్యేక హోదా కోసం యువత తలపెట్టిన నిరసనకు మద్దతు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేయడాన్ని ఏపీ యువజన జేఏసీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. విశాఖలో అంతర్జాతీయ సీఐఏ సదస్సు జరుగుతుండటంతో నిరసనను విరమించుకోవాలని అన్నారు. ట్వీట్ల ద్వారా యువతను పవన్ కల్యాణ్ తప్పుదోవ పట్టిస్తున్నారని.. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో మాట్లాడని పవన్, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని యువజన జేఏసీ నేతలు ప్రశ్నించారు.
నాగబాబు:: "ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినప్పుడు కేంద్రప్రభుత్వం మనకిచ్చిన మాట స్పెషల్ స్టేటస్. కానీ విడగొట్టిన తర్వాత ఆ ప్రామిస్ ను నిలబెట్టుకోలేదు.. కేంద్ర ప్రభుత్వం మాట తప్పింది.. స్పెషల్ ప్యాకేజ్ అని చెబుతుంది. ఇప్పుడు నేను చెబుతున్నా మాకు ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు... రేపు జరగబోయే శాంతియుత ర్యాలీకి, ప్రదర్శనకు నా సంపూర్ణ సహకారం సంపూర్ణ మద్దతు ఉంది.. జై ఆంధ్ర.. జై హింద్" అని జనవరి 26న విశాఖలో జరగబోయే ఏపీ స్పెషల్ స్టేటస్ శాంతి ర్యాలీకి నిర్మాత, నటుడు నాగబాబు తన మద్దతును ప్రకటించారు!
Full View
"ప్రజల కోసం ప్రభుత్వంతో ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు విభేదించాలనే విషయం జనసేనకు తెలుసు" అని పవన్ తాజాగా ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఏపీ ప్రత్యేక హోదా విషయంలో తమకు ఇన్సిపిరేషన్ గా నిలిచిన జల్లికట్టు పోరాట యోధులకు పవన్ సెల్యూట్ చేశారు.
"1997లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చినా మళ్లీ తెలంగాణ ఊసు లేదు.. దాని పర్యావసానం నిండు నూరేళ్లు బ్రతకాల్సిన 1458మంది తెలంగాణ యువకుల బలిదానాలు. ఒక సున్నితమైన సమస్యని, అనేక కోట్లమంది భవిష్యత్తుతో ముడిపడిన సమస్యని 17సంవత్సరాలు నాంచి, 12 గంటల్లో తేల్చేశారు. ఇదేనా మీరు చెప్పుకునే సుధీర్ఘ రాజకీయ అనుభవం మీకు నేర్పింది!" అంటూ ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన బీజేపీ నేతలపై పవన్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు.
జగన్ వస్తున్నాడు..మరి పవన్ కళ్యాణ్ వస్తున్నాడా - పవన్ కళ్యాణ్ వస్తున్నాడా అనే ప్రశ్నపై స్పందించిన జనసేన లీడర్ ..
Full View
పవన్ కల్యాణ్:: "కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేపు జరగబోయే శాంతియుత నిరసనను అడ్డుకోవాలని చూస్తే... తమ హక్కుల కోసం ఏపీ వాసులు చేసే పోరాటానికి సిద్ధంగా ఉండాలి" అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జనవరి 26న విశాఖలో జరగబోయే ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడం, పోలీసులు హెచ్చరికలు జారీచేయడంపై పవన్ ఇలా స్పందించారు!
సీపీఐ రామకృష్ణ:: "ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం శోచనీయం.. ప్రత్యేక హోదా గురించి గళమెత్తితే జైలుకు పంపిస్తామని బెదిరించడం సరికాదు" అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
చలసాని శ్రీనివాస్ :: "రేపు తలపెట్టిన కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతాం.. హోదా పోరాటాన్ని తొక్కుతామంటే లేచి మరీ పోరాడతాం.. ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి వద్దు, ఎన్నో ప్రయోజనాలకు తెచ్చిపెట్టే హోదానే కావాలి.. ప్రజల ప్రయోజనాల కోసం నిరసనలు తెలిపేవారిని అరెస్టు చేస్తామంటే బెదరబోము" అని జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ స్పందించారు.
పవన్ కళ్యాణ్:: "యువత చెయ్యలనుకుంటున్న "ఏపి ప్రత్యేకహోదా శాంతియుత పోరాటాన్ని" ఎవరు నీరుకార్చినా, వారు ఏపి రాష్ట్రయువత భవిష్యత్తుని నాశనం చెయ్యటమే..." అని తాజాగా పవన్ ట్విట్టర్ లో స్పందించారు.
దేవినేని ఉమ:: "జనవరి 26, ఆగస్టు 15 దేశ ప్రజలు గర్వపడే దినోత్సవాలు, ఎంతో ప్రత్యేకమైన రోజులు.. ఆ రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమిటి" అని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉద్దేశిస్తూ దేవినేని ఉమామహేశ్వర రావు స్పందించారు. ప్రత్యేక హోదాకు బదులు పోలవరం వంటి ఎన్నో ప్రయోజనాలను సాధించామని తెలిపారు.
తెరాస ఎంపీ కవిత:: తమిళనాడు ప్రజలు చేసిన జల్లికట్టు ఉద్యమంతో స్ఫూర్తి పొందిన ఆంధ్ర యువత వారి హక్కు అయిన "ప్రత్యేక హోదా" కోసం పోరాడతామని ప్రకటించిన అనంతరం దీనిపై టీఆరెస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై తెలుగువారమంతా కలిసి పోరాడుడదామని.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పోరాటానికి తాము మద్దతు తెలుపుతున్నామని అన్నారు.
Full View
జయప్రకాశ్ నారాయణ్: "ప్రత్యేక హోదాపై అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి పోరాడుతున్న యువతకు అభినందనలు" అని విశాఖ ఆర్కే బీచ్ లో జనవరి 26న జరగబోయే ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమం పై ట్విట్టర్ లో స్పందించారు. హోదాకు సమానమైన ప్యాకేజీని ఏపీకి ఇచ్చామని ప్రకటించుకుంటున్న కేంద్ర ప్రభుత్వ మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు.. హోదాతో 100% ఐటీ పన్ను మినహాయింపు, కార్పొరేట్ పన్ను మినహాయింపు, ఎక్సైజ్ సుంకం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.. అని జేపీ అన్నారు!
వైఎస్ జగన్:: ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, రేపు విశాఖపట్నంలో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి నేను హాజరు అవుతున్నాను. శాంతియుతంగా తలపెట్టిన ర్యాలీని ఎలా అడ్డుకుంటారో చూస్తాను. ర్యాలీలో

విశాఖ ఆర్కే బీచ్ కి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుకుంటున్నారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం మౌన నిరసన చేపడుతున్నారు.
"ఆలస్యం అయ్యే కొద్దీ ప్రత్యేక హోదా సాధించడం కష్టం.. దీనికోసం మనం పోరాడాలి.. కానీ యువత గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలం ఉద్యమాలతో ప్రత్యేక హోదా రాదు, రాజకీయంగానే దీనికి పరిష్కారం లభిస్తుంది.. కాబట్టి యువత భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా నిరసన తెలపాలి" అని లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.
ఏపీ ప్రత్యేక హోదా కోసం మౌన నిరసన చేయట్టిన యువతను అరెస్ట్ చేసి బక్కనపాలెం పోలీస్ అకాడమీకి తరలించారు.
విశాఖలో మౌన నిరసన చేపట్టిన యువతను పోలీసులు అరెస్టు చేశారు.
"పోలీస్ స్టేషన్ లోనే మౌన పోరాటం సాగిస్తున్న యువత"
మురళీమోహన్:: ఆందోళనలు, ఉద్యమాలతో అభివృద్ధిని అడ్డుకోవద్దు.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దం అని విశాఖలో జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటంపై రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు.
ధర్మాన ప్రసాదరావు:: ఆంధ్రప్రదేశ్ లో అప్రజాస్వామిక పాలన సాగుతోంది.. ప్రజలను ఆకాంక్షను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది.. ప్రపంచంలో ఇలాంటి అరెస్టులు ఎక్కడా జరగలేదు.. దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపింది.. ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉధృతమవుతుందని అని స్పందించారు వైఎస్సార్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు
నితిన్:: "యువత బంగారు భవిష్యత్ కోసం చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటానికి నా మద్దతు ఉంటుంది" అని హీరో నితిన్ ట్విట్టర్ లో స్పందించారు.
ప్రత్యేక హోదాపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఆంధ్రా యువతరం విశాఖలో తలపెట్టిన కార్యక్రమాన్ని ఇప్పటివరకూ పోలీసుల నుంచే ఇబ్బందులు ఎదురవుతుండగా, తాజాగా విద్యాసంస్థలు కూడా ఆ బాధ్యత తీసుకున్నాయి! ఈ సందర్భంగా ఎసెమ్మెస్ల ద్వారా తమ విద్యార్థులకు ఆదేశాలను జారీ చేశాయి. విశాఖలోని గీతం యూనివర్శిటీ తమ స్టూడెంట్స్ కి ఈ తరహా సందేశాలే ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న పిలుపులకు స్పందించవద్దనీ.. ఈ నిరసనలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని.. గీతం విద్యార్థులు ఆర్కే బీచ్ వైపు వెళ్లొదంటూ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. గీతమ్స్ బాటలోనే ఇతర విద్యా సంస్థలు కూడా ఇదేవిధంగా తమ స్టూడెంట్స్ కి చెబుతున్నాయి.
పవన్ కళ్యాణ్:: "ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే మీరు తెలంగాణా యువతకి కోపం తెప్పించి, "ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు" అన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారు" అని పవన్ ట్విట్టర్ లో (రాయపాటి శాంబశివరావుని ఉద్దేశించి!) స్పందించారు.
వైఎస్ జగన్:: స్వాతంత్య్రానంతరం చట్టాలను సవరించుకుని రిపబ్లిక్ కంట్రీగా అవతరించిన రోజు.. 68 ఏళ్ల క్రితం మనం రాసుకున్న చట్టాలు ఇప్పుడు అమలు అవుతున్నాయా.. పాలకులే రూల్స్ ని బ్రేక్ చేయడం బాధాకరం.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతతూ, ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వారిని అరెస్ట్ చేస్తారా.. మనం ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. బ్రిటిష పాలనలో ఉన్నామా.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారన్నారు" అని జగన్ ఫైరయ్యారు.
పవన్ కళ్యాణ్:: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి, పెద్దలు 'రాయపాటి' గారు ఒక సారి ఆలోచించండి
పవన్ కళ్యాణ్:: విభజన ముందు పంచభక్ష్యాలతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామని మాట ఇచ్చి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి.. అన్ని రాష్ట్రాలకీ సాధారణంగా ఇచ్చే నిధులకి స్పెషల్ ప్యాకేజీ అని ముసుగు తొడిగి రెండు పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు పవన్.
జగన్ కాన్వాయ్ సిబ్బంది అరెస్ట్:: విశాఖ జిల్లాలోని పరవాడ దగ్గర సుమారు 23మంది జగన్ కాన్వాయ్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో హోదా సాధనకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జగన్ ఈరోజు సాయంత్రానికి విశాఖ చేరుకునేందుకు సిద్ధపడ్డారు. ఇదే క్రమంలో విశాఖ చేరుకున్న వెంటనే జగన్ ను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం!
రచయిత చిన్నికృష్ణ:: జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని ఆందోళన చేసేవారు.. ఏ కోళ్లపందాలో, పందుల పందాలో నిర్వహించుకోవాలని సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ స్పందించారు. ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న సుజనా చౌదరే ఒక "పంది" అని విమర్శించిన ఆయన.. "అలాంటి పందివైన నీతోనే ఆట స్టార్ చేస్తాం" అని హెచ్చరించారు. విద్యార్థులను అరెస్టు చేస్తే హోదా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చిన్ని కృష్ణ పేర్కొన్నారు.
గంటా శ్రీనివాస్:: ప్రత్యేక హోదా కోసం ధర్నా, దీక్ష చేయాలనుకుంటే ఢిల్లీలో చేయాలి. కానీ మీరు అది చేయరు. కర్నూలు లోనో, అనంతపురంలోనో, విజయవాడలోనో దీక్ష పేరుతో మీరు అరాచకం సృష్టిస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి ఎవరు ఇవ్వాలో వారు ముందు పోరాడండి... అని జగన్ కు సూచించారు మంత్రి గంటా శ్రీనివాస్.
బోండా ఉమ:: ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అంశాన్ని, 2017తో ముగుస్తున్న అంశాన్ని తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు విశాఖపట్నాన్ని మరో తుని చేయాలని భావిస్తున్నారు. ఈ పరిస్తితుల్లో జగన్ చేయట్టిన విద్వంస వ్యూహాన్ని అర్ధం చేసుకున్న యువత తమ విశాఖను తాము రక్షించుకోవడానికి అంతా ప్రభుత్వానికి సహరించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రత్యేక హోదా అనే పదం తప్ప మిగిలిన అన్ని విషయాలను అమలు చేస్తామని కేంద్రం చెప్పిన మాటపై జగన్ మోహన్ రెడ్డి చర్చకు సిద్ధమా... జగన్ మోహన్ రెడ్డీ నువ్వు మూర్ఖుడివి, నీ మూర్ఖత్వాన్ని నీ ఆలోచనలను యువత అర్ధం చేసుకుని నీ దారిలోకి రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూన్నాను. జనసేన నాయకులు పవన్ కల్యాణ్ గారు కూడా కచ్చితంగా అర్ధం చేసుకోవాలి.. అని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు.
ఆంధ్రా యువత పేరిట ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు తాజాగా అరెస్టుచేశారు. వైఎంసీఏ వద్ద జాతీయ జెండాలు చేతపట్టి మౌన ప్రదర్శన మొదలెట్టిన సుమారు 40మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు-విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో నెల్లూరు, విజయవాడల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నెల్లూరు, విజయవాడలను పోలీసులు మొత్తం నిర్భందించారు.
సుజనా చౌదరి: ఆర్కే బీచ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీలోని యువత గళం విప్పుతుంటే టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. జల్లికట్టు స్పూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్ వేదికగా ఏకమవుతున్నామని చెప్తున్న వారు జల్లికట్టు రూపంలోనే పందాలు ఆడుకోవాలని ఎద్దేవా చేశారు. కోడిపందాలు, అవసరమైతే పందుల పందాలు సైతం ఆడుకోవచ్చని సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా విద్యార్థులను, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుండటం వల్లే ఇలాంటి నిరసనలు, ఆందోళనల గళం తెరమీదకు వస్తోందని సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Full View
నేడు విశాఖలో జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతుగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు వద్ద ఐటీ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. "వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్" అంటూ నినదించారు.
సంపూర్నేష్ బాబు అరెస్ట్:: ఏపీ యువత తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి తనవంతు మద్దతు తెలుపుతూ, విశాఖకు చేరుకున్న సినీనటుడు సంపూర్నేష్ బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక తెలుగువాడిగా ఆంధ్రులు చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడమేనా సంపూ చేసిన నేరం!
Full View
"మాకు లడ్డుల మీద కానీ, అవి అమ్మే వ్యాపారులమీద కానీ, ఎలాంటి చులకన భావం లేదని జనసేన మనవి చేసుకుంటుంది. కానీ... అడక్కుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారిమీదే మాకున్న అసహనం అని గుర్తించాలని జనసేన పార్టీ విన్నవిస్తోంది.
- లడ్డూ తినడం ఆరోగ్యానికి హానికరం కాదు.." అని తాజాగా పవన్ ట్విట్టర్ లో స్పందించారు.
వైకాపా ఎమ్మెల్యే రోజా:: వైజాగ్ బిచ్ లో బికినీ షోలకు అనుమతి ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. ప్రత్యేక హోదా కోసం నిరసన తెలుపుతామంటే మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, ప్రత్యేక ప్యాకేజీ అయితే, కమీషన్లు దండుకోవచ్చునని ప్రభుత్వం చూస్తుంది" అని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.
రాం గోపాల్ వర్మ:: "మహేష్ బాబు నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి, రాజకీయాలను పట్టించుకోని వ్యక్తి అయితే తమిళులు చేపట్టిన జల్లికట్టుపై ఎందుకు స్పందించాడు.. ఇప్పుడు పవన్ పోరాటంపైనా, ఏపీ సమస్యలపైనా ఎందుకు స్పందించడం లేదు" అని మహేష్ బాబు తీరుపై రాం గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు.
"ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు నాకు ఆశ్చర్య కరంగా ఉంది.. ఏపీ ముఖ్యమంత్రి అయ్యి కూడా రాష్ట్ర సమస్యలపై పవన్ కల్యాణ్ కంటే తక్కువగా స్పందిస్తున్నారు" అని మరో ట్వీట్ లో చంద్రబాబు విధానంపై వర్మ స్పందించారు.
"పవన్ పోరాటం మీద, ఏపీ సమస్యలమీదా స్పందించకుండా ఇలానే ఉంటే ఏపీకి మహేష్ బాబు, చంద్రబాబు నిజమైన విలన్లు" అని వర్మ ట్వీట్టర్ లో స్పందించారు.
"మిగిలిన హీరోలు కేవలం సినిమాల్లో పోలీసుల మీద, విలన్ల మీద పోరాడుతుంటారు కానీ... పవన్ మాత్రం నిజమైన పోలీసులు మీద, రాజకీయ నాయకుల మీదా, విలన్ ల మీదా పోరాడుతున్నాడు" అని మరో ట్వీట్ లో వర్మ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం, ప్రత్యేక హోదా గురించి ఇంకా మాట్లాడడం అనవరం, పవన్ కళ్యాణ్ సహా ఎవరైనా ఫలానా విధంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని చెబితే స్పందిస్తాం, ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే తనను కలవొచ్చు, సమాధానం చెబుతాం" అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు.
ఈరోజు విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మరో నాలుగు "దేశ్ బచావ్" ఆల్బం నుంచి విడుదల చేశారు. ఈ నాలుగు పాటలలోనూ "ట్రావెలింగ్ సోల్జర్ బంగ్రా లడ్డూ మిక్స్" ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేక హోదా విషయంలో నాయకులు ఏ విధంగా మాటలు మార్చారు అనే విషయాన్ని చూపిస్తూ... ఆ మాటలకు రేపటి పౌరులు ఎలా స్పందిస్తున్నారనే విషయం ఆకట్టుకునేలా ఉంది.
ట్రావెలింగ్ సోల్జర్ పవర్ ఫుల్ మిక్స్
Full View
ట్రావెలింగ్ సోల్జర్ సౌత్ ఇండియా మిక్స్
Full View
రాజులకు రాజు.. నా పోతురాజు.. నువ్వు వాసనకే సంపెంగ పువ్వువా...
Full View ట్రావెలింగ్ సోల్జర్ బంగ్రా లడ్డూ మిక్స్
"ఆలస్యం అయ్యే కొద్దీ ప్రత్యేక హోదా సాధించడం కష్టం.. దీనికోసం మనం పోరాడాలి.. కానీ యువత గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలం ఉద్యమాలతో ప్రత్యేక హోదా రాదు, రాజకీయంగానే దీనికి పరిష్కారం లభిస్తుంది.. కాబట్టి యువత భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా నిరసన తెలపాలి" అని లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.
ఏపీ ప్రత్యేక హోదా కోసం మౌన నిరసన చేయట్టిన యువతను అరెస్ట్ చేసి బక్కనపాలెం పోలీస్ అకాడమీకి తరలించారు.
విశాఖలో మౌన నిరసన చేపట్టిన యువతను పోలీసులు అరెస్టు చేశారు.
"పోలీస్ స్టేషన్ లోనే మౌన పోరాటం సాగిస్తున్న యువత"
విశాఖ సెంట్రల్ పార్క్ లో విద్యార్థులను అరెస్ట్ చేసి ఉంచిన పోలీసులు
మురళీమోహన్:: ఆందోళనలు, ఉద్యమాలతో అభివృద్ధిని అడ్డుకోవద్దు.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దం అని విశాఖలో జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటంపై రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు.
ధర్మాన ప్రసాదరావు:: ఆంధ్రప్రదేశ్ లో అప్రజాస్వామిక పాలన సాగుతోంది.. ప్రజలను ఆకాంక్షను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది.. ప్రపంచంలో ఇలాంటి అరెస్టులు ఎక్కడా జరగలేదు.. దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపింది.. ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉధృతమవుతుందని అని స్పందించారు వైఎస్సార్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు
నితిన్:: "యువత బంగారు భవిష్యత్ కోసం చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటానికి నా మద్దతు ఉంటుంది" అని హీరో నితిన్ ట్విట్టర్ లో స్పందించారు.
ప్రత్యేక హోదాపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఆంధ్రా యువతరం విశాఖలో తలపెట్టిన కార్యక్రమాన్ని ఇప్పటివరకూ పోలీసుల నుంచే ఇబ్బందులు ఎదురవుతుండగా, తాజాగా విద్యాసంస్థలు కూడా ఆ బాధ్యత తీసుకున్నాయి! ఈ సందర్భంగా ఎసెమ్మెస్ల ద్వారా తమ విద్యార్థులకు ఆదేశాలను జారీ చేశాయి. విశాఖలోని గీతం యూనివర్శిటీ తమ స్టూడెంట్స్ కి ఈ తరహా సందేశాలే ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న పిలుపులకు స్పందించవద్దనీ.. ఈ నిరసనలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని.. గీతం విద్యార్థులు ఆర్కే బీచ్ వైపు వెళ్లొదంటూ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. గీతమ్స్ బాటలోనే ఇతర విద్యా సంస్థలు కూడా ఇదేవిధంగా తమ స్టూడెంట్స్ కి చెబుతున్నాయి.
"మీరు నమ్మండి ఇది పోలీస్ స్టేట్షన్ కాదు.. మేము విద్యార్థులం, క్రిమినల్స్ మి కాదు.. ఇది గీతం యూనివర్శిటీలో పరిస్థితి"
పవన్ కళ్యాణ్:: "ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే మీరు తెలంగాణా యువతకి కోపం తెప్పించి, "ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు" అన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారు" అని పవన్ ట్విట్టర్ లో (రాయపాటి శాంబశివరావుని ఉద్దేశించి!) స్పందించారు.
వైఎస్ జగన్:: స్వాతంత్య్రానంతరం చట్టాలను సవరించుకుని రిపబ్లిక్ కంట్రీగా అవతరించిన రోజు.. 68 ఏళ్ల క్రితం మనం రాసుకున్న చట్టాలు ఇప్పుడు అమలు అవుతున్నాయా.. పాలకులే రూల్స్ ని బ్రేక్ చేయడం బాధాకరం.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతతూ, ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వారిని అరెస్ట్ చేస్తారా.. మనం ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. బ్రిటిష పాలనలో ఉన్నామా.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారన్నారు" అని జగన్ ఫైరయ్యారు.
పవన్ కళ్యాణ్:: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి, పెద్దలు 'రాయపాటి' గారు ఒక సారి ఆలోచించండి
పవన్ కళ్యాణ్:: విభజన ముందు పంచభక్ష్యాలతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామని మాట ఇచ్చి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి.. అన్ని రాష్ట్రాలకీ సాధారణంగా ఇచ్చే నిధులకి స్పెషల్ ప్యాకేజీ అని ముసుగు తొడిగి రెండు పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు పవన్.
జగన్ కాన్వాయ్ సిబ్బంది అరెస్ట్:: విశాఖ జిల్లాలోని పరవాడ దగ్గర సుమారు 23మంది జగన్ కాన్వాయ్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో హోదా సాధనకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జగన్ ఈరోజు సాయంత్రానికి విశాఖ చేరుకునేందుకు సిద్ధపడ్డారు. ఇదే క్రమంలో విశాఖ చేరుకున్న వెంటనే జగన్ ను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం!
రచయిత చిన్నికృష్ణ:: జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని ఆందోళన చేసేవారు.. ఏ కోళ్లపందాలో, పందుల పందాలో నిర్వహించుకోవాలని సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ స్పందించారు. ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న సుజనా చౌదరే ఒక "పంది" అని విమర్శించిన ఆయన.. "అలాంటి పందివైన నీతోనే ఆట స్టార్ చేస్తాం" అని హెచ్చరించారు. విద్యార్థులను అరెస్టు చేస్తే హోదా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చిన్ని కృష్ణ పేర్కొన్నారు.
గంటా శ్రీనివాస్:: ప్రత్యేక హోదా కోసం ధర్నా, దీక్ష చేయాలనుకుంటే ఢిల్లీలో చేయాలి. కానీ మీరు అది చేయరు. కర్నూలు లోనో, అనంతపురంలోనో, విజయవాడలోనో దీక్ష పేరుతో మీరు అరాచకం సృష్టిస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి ఎవరు ఇవ్వాలో వారు ముందు పోరాడండి... అని జగన్ కు సూచించారు మంత్రి గంటా శ్రీనివాస్.
బోండా ఉమ:: ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అంశాన్ని, 2017తో ముగుస్తున్న అంశాన్ని తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు విశాఖపట్నాన్ని మరో తుని చేయాలని భావిస్తున్నారు. ఈ పరిస్తితుల్లో జగన్ చేయట్టిన విద్వంస వ్యూహాన్ని అర్ధం చేసుకున్న యువత తమ విశాఖను తాము రక్షించుకోవడానికి అంతా ప్రభుత్వానికి సహరించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రత్యేక హోదా అనే పదం తప్ప మిగిలిన అన్ని విషయాలను అమలు చేస్తామని కేంద్రం చెప్పిన మాటపై జగన్ మోహన్ రెడ్డి చర్చకు సిద్ధమా... జగన్ మోహన్ రెడ్డీ నువ్వు మూర్ఖుడివి, నీ మూర్ఖత్వాన్ని నీ ఆలోచనలను యువత అర్ధం చేసుకుని నీ దారిలోకి రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూన్నాను. జనసేన నాయకులు పవన్ కల్యాణ్ గారు కూడా కచ్చితంగా అర్ధం చేసుకోవాలి.. అని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు.
ఆంధ్రా యువత పేరిట ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు తాజాగా అరెస్టుచేశారు. వైఎంసీఏ వద్ద జాతీయ జెండాలు చేతపట్టి మౌన ప్రదర్శన మొదలెట్టిన సుమారు 40మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు-విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో నెల్లూరు, విజయవాడల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నెల్లూరు, విజయవాడలను పోలీసులు మొత్తం నిర్భందించారు.
సుజనా చౌదరి: ఆర్కే బీచ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీలోని యువత గళం విప్పుతుంటే టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. జల్లికట్టు స్పూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్ వేదికగా ఏకమవుతున్నామని చెప్తున్న వారు జల్లికట్టు రూపంలోనే పందాలు ఆడుకోవాలని ఎద్దేవా చేశారు. కోడిపందాలు, అవసరమైతే పందుల పందాలు సైతం ఆడుకోవచ్చని సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా విద్యార్థులను, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుండటం వల్లే ఇలాంటి నిరసనలు, ఆందోళనల గళం తెరమీదకు వస్తోందని సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు విశాఖలో జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతుగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు వద్ద ఐటీ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. "వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్" అంటూ నినదించారు.
సంపూర్నేష్ బాబు అరెస్ట్:: ఏపీ యువత తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి తనవంతు మద్దతు తెలుపుతూ, విశాఖకు చేరుకున్న సినీనటుడు సంపూర్నేష్ బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక తెలుగువాడిగా ఆంధ్రులు చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడమేనా సంపూ చేసిన నేరం!
"మాకు లడ్డుల మీద కానీ, అవి అమ్మే వ్యాపారులమీద కానీ, ఎలాంటి చులకన భావం లేదని జనసేన మనవి చేసుకుంటుంది. కానీ... అడక్కుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారిమీదే మాకున్న అసహనం అని గుర్తించాలని జనసేన పార్టీ విన్నవిస్తోంది.
- లడ్డూ తినడం ఆరోగ్యానికి హానికరం కాదు.." అని తాజాగా పవన్ ట్విట్టర్ లో స్పందించారు.
వైకాపా ఎమ్మెల్యే రోజా:: వైజాగ్ బిచ్ లో బికినీ షోలకు అనుమతి ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. ప్రత్యేక హోదా కోసం నిరసన తెలుపుతామంటే మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, ప్రత్యేక ప్యాకేజీ అయితే, కమీషన్లు దండుకోవచ్చునని ప్రభుత్వం చూస్తుంది" అని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.
రాం గోపాల్ వర్మ:: "మహేష్ బాబు నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి, రాజకీయాలను పట్టించుకోని వ్యక్తి అయితే తమిళులు చేపట్టిన జల్లికట్టుపై ఎందుకు స్పందించాడు.. ఇప్పుడు పవన్ పోరాటంపైనా, ఏపీ సమస్యలపైనా ఎందుకు స్పందించడం లేదు" అని మహేష్ బాబు తీరుపై రాం గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు.
"ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు నాకు ఆశ్చర్య కరంగా ఉంది.. ఏపీ ముఖ్యమంత్రి అయ్యి కూడా రాష్ట్ర సమస్యలపై పవన్ కల్యాణ్ కంటే తక్కువగా స్పందిస్తున్నారు" అని మరో ట్వీట్ లో చంద్రబాబు విధానంపై వర్మ స్పందించారు.
"పవన్ పోరాటం మీద, ఏపీ సమస్యలమీదా స్పందించకుండా ఇలానే ఉంటే ఏపీకి మహేష్ బాబు, చంద్రబాబు నిజమైన విలన్లు" అని వర్మ ట్వీట్టర్ లో స్పందించారు.
"మిగిలిన హీరోలు కేవలం సినిమాల్లో పోలీసుల మీద, విలన్ల మీద పోరాడుతుంటారు కానీ... పవన్ మాత్రం నిజమైన పోలీసులు మీద, రాజకీయ నాయకుల మీదా, విలన్ ల మీదా పోరాడుతున్నాడు" అని మరో ట్వీట్ లో వర్మ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం, ప్రత్యేక హోదా గురించి ఇంకా మాట్లాడడం అనవరం, పవన్ కళ్యాణ్ సహా ఎవరైనా ఫలానా విధంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని చెబితే స్పందిస్తాం, ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే తనను కలవొచ్చు, సమాధానం చెబుతాం" అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు.
ఈరోజు విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మరో నాలుగు "దేశ్ బచావ్" ఆల్బం నుంచి విడుదల చేశారు. ఈ నాలుగు పాటలలోనూ "ట్రావెలింగ్ సోల్జర్ బంగ్రా లడ్డూ మిక్స్" ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేక హోదా విషయంలో నాయకులు ఏ విధంగా మాటలు మార్చారు అనే విషయాన్ని చూపిస్తూ... ఆ మాటలకు రేపటి పౌరులు ఎలా స్పందిస్తున్నారనే విషయం ఆకట్టుకునేలా ఉంది.
ట్రావెలింగ్ సోల్జర్ పవర్ ఫుల్ మిక్స్
ట్రావెలింగ్ సోల్జర్ సౌత్ ఇండియా మిక్స్
రాజులకు రాజు.. నా పోతురాజు.. నువ్వు వాసనకే సంపెంగ పువ్వువా...
మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇచినా సరిపోదన్నది మీరే.. ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదు అద్భుతాలు చేయటానికి అన్నదీ మీరె.. హోదాని మించింది ప్యాకేజ్ అని చప్పట్లు కొట్టిందీ మీరే.. ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తామన్నదీ మీరే.. అసలు చట్టబద్దత అవసరం లేదంటుందీ మీరే.. మీరు ఇన్ని అన్నప్పుడు మా ప్రజలు విన్నారు.. మరి మా ప్రజల ఆక్రోశం, ఆవేదన కనీసం ఒక్కసారి చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలా?
పాలకులు, పాలక వర్గాలు ఏభై ఏళ్లుగ వారి వారి పార్టీల ప్రయోజనాలకోసం చేసిన స్వార్ధపూరిత కుట్రలకి, ఏ తప్పూ చేయని ప్రజలు ద్వేషంతో విడిపోవాల్సి వచ్చింది. ఆ నిర్లక్ష్య పూరిత విభజన పద్దతికి వచ్చిన నష్టాలని అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా గత మూడేళ్లుగా మళ్లీ ఇలాంటి ధోరణి అవలంభిస్తూ, మా ప్రజలని ఇంకెంత నిరాశ, నిస్పృహలోకి నెడతారు?
ఇప్పుడు ఆంధ్రులు చేస్తున్న పోరాటం వల్ల వెంటనే న్యాయం జరుగుతుందా లేదా అనేకంటే.. భవిష్యత్తు తరాల్లో ఇలాంటి నీచ రాజకీయాలు చేయాలంటే భయపడాలి. జనసేన పోరాటం తాలూకు అంతిమలక్ష్యం అదే.
గుణశేఖర్:: "సైలంట్ ప్రొటెస్ట్ ఈస్ బెటర్ దేన్ వైలెన్స్" అంటూ స్పందించారు డైరెక్టర్ గుణశేఖర్. రేపు ఏపీ యువత విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన నిరసన పై స్పందించిన గుణశేఖర్ తన మద్దుతు ప్రకటించారు.
హీరో రామ్ : "డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. అడగట్లేదు.. అడుక్కోవట్లేదు.. ఎదురుచూస్తున్నాం.. లెస్ నాయిస్ = మోర్ సౌండ్" అంటూ ట్విట్టర్ లో స్పందించారు హీరో రాం. రిపబ్లిక్ డే రోజున విశాఖ ఆర్కే బీచ్ లో ఏపీ యువత చేపట్టబోయే నిరసనపై రాం ఇలా స్పందించారు.
సాయిధరం తేజ్:: ప్రియమైన ఆంధ్రప్రదేశ్ యువతకు విన్నపం...
1. కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్ధానం కోసం ఈ పోరాటం
2. దయచేసి పోలీసులకు సహకరించండి. వారి రూల్స్ ప్రకారం నడుచుకోండి. ఒక శాంతియుత నిరసనకు సహకరించండి.
3. దయచేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంశాలకు పాల్పడకండి.
4. ఈ నిరసన కార్యక్రమంలో ఎవరైన ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా.. ఆ సంఘటనలను వీడియో తీసి పోలీసు అధికారులకు కాని, మీడియాకు కానీ ఇవ్వండి.
5. అన్నింటికంటే మీ క్షేమం ముఖ్యం. కార్యక్రమం అనంతరం మీరు ఇంటికి క్షేమంగా తిరిగి వెల్లండి. మీ కుటుంబం మీకోసం ఎదురుచూస్తుంది.. జై హింద్..
అంటూ ట్విట్టర్ లో రేపటి కార్యక్రమానికి సంబందించి ఏపీ యువతకు హీరో సాయిధరం తేజ్ సూచనలు చేశారు.
శివాజీ : అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా తిననివ్వదు అన్నట్లుంది ప్రస్తుతం ఏపీలో పరిస్థితి.. ఈ పోరాటం చంద్రబాబుకి వ్యతిరేకంగా చేస్తున్నారని ఎందుకనుకుంటున్నారో అర్ధం కావడం లేదు.. ఇది చంద్రబాబుపై పోరాటం కాదు, భావి ఆంధ్రుల జీవన్మరణ సమస్య. ప్రత్యేక హోదా అనేది ఏపీలో ఉన్న ప్రతి బిడ్డ హక్కు. తమ హక్కును పొందలేకపోతున్నారనే నిరసనను వ్యక్త పరచడానికి ఆర్కే బీచ్ కి వస్తే మీకేమిటి ప్రాబ్లం. నిరసన తెలియజేసే హక్కును మీరు కాదంటే... గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసివి ఏమిటి? మీరు చేస్తే మంచి పని, జనాలు చేస్తే అభివృద్ధిని అడ్డుకునే చర్య? ఒకప్పుడు మీరు రైతు వ్యతిరేకి అనే ముద్ర వేసుకున్నారు, ఒకప్పుడు మీరు ఉద్యోగ వ్యతిరేకి అనే ముద్రవేసుకున్నారు.. ఇప్పుడు యువత వ్యతిరేకి అనే ముద్ర వేసుకోవద్దు దయచేసి. రేపు జరిగే ఆత్మగూరవ పోరాటానికి మద్దతు తెలపండి. హై హింద్.. జై ఆంధ్రప్రదేశ్.. జై ఆంధ్రప్రదేశ్ యువత" అంటూ తాజాగా ఒక వీడియోలో స్పందించారు హీరో శివాజి!
https://www.facebook.com/