ఆసుప‌త్రిలో అమ్మ‌లా ఉండేవార‌ట‌!

Update: 2019-01-30 05:04 GMT
త‌మిళుల గుండెల్లో అమ్మ‌గా కొలువైన దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు సంబంధించిన సంచ‌ల‌న విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనారోగ్యంతో హ‌డావుడిగా అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేర్చిన అమ్మ‌.. అక్క‌డే నెలల పాటు ఉంటూ అనారోగ్యంతో అక్క‌డే క‌న్నుమూయ‌టం తెలిసిందే. అపోలో ఆసుప‌త్రిలో అమ్మ‌కు వైద్యం చేసిన మ‌హిళా వైద్యురాలు డాక్ట‌ర్ శిల్ప‌.

ఆసుప‌త్రిలో చేరిన నాటి నుంచి మ‌ర‌ణానికి ఒక రోజు ముందు వ‌ర‌కూ ఆమెకు వైద్యం చేసిన ముఖ్య‌మైన వైద్యుల్లో డాక్ట‌ర్ శిల్ప ఒక‌రు. తాజాగా అమ్మ మృతిపై అనుమానాలు వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన  జ‌స్టిస్ ఆర్ముగ‌స్వామి క‌మిటీ ఎదుట డాక్ట‌ర్ శిల్ప హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించారు.

ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న స‌మ‌యంలో అమ్మ మాన‌సిక తీరు అస్థిరంగా ఉండేద‌ని చెప్పారు. ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు రకాలుగా వ్య‌వ‌హ‌రించేవార‌ని.. ఆమె ఎక్కువ‌గా ఒంట‌రిగా ఉండ‌టానికి ఇష్టం చూపేవార‌న్నారు కొన్ని సంద‌ర్భాల్లో న‌వ్వుతూ ఉండే ఆమె.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో మాత్రం న‌న్ను ఒంట‌రిగా ఉండ‌నివ్వండి.. అంటూ క‌సురుకునేవారంటూ సాక్ష్య‌మిచ్చారు.

2016 సెప్టెంబ‌రులో తీవ్ర అస్వ‌స్థ‌తో అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత అపోలో ఆసుప‌త్రికి చేరిన అమ్మ‌.. ఆ త‌ర్వాత ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. ఆమెకుచికిత్స చేసేందుకు విదేశాల నుంచి సైతం వైద్యుల్ని తీసుకొచ్చారు. వైద్యులు ఎంత ప్ర‌య‌త్నించినా.. అమ్మ ప్రాణాల్ని కాపాడ‌లేక‌పోవ‌టంతో కోట్లాది మంది త‌మిళుల శోకం సంద్రంగా మారిన వైనం తెలిసిందే.
Tags:    

Similar News