భారీ వర్షాలతో కేరళ ఎంతలా ప్రభావితమైందో తెలిసిందే. లక్షలాది మందిని భారీగా నష్టపోయేలా చేయటమే కాదు.. కేరళ కుదేలయ్యేలా చేసిన ఈ ప్రకృతి వైపరీత్యంపై ఇప్పటికే పలువురు స్పందిస్తున్నారు. పెద్ద ఎత్తున సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ కూడా కేరళ వైపరీత్యంపై స్పందించింది.
కేరళ వరదల గురించి తమకు తెలిసి షాక్ తిన్నామని.. కేరళ సీఎం సహాయ నిధికి మెర్సీ కార్ప్స్ ఇండియా కు రూ.7కోట్లు విరాళాన్ని తాము ఇచ్చినట్లుగా యాపిల్ పేర్కొంది. అంతేకాదు.. తాను సాయం చేయటమే కాదు.. కేరళకు మరింత సాయం చేయాల్సిందిగా యాపిల్ తన యూజర్లను కోరుతోంది.
ఇందుకోసం యాప్ స్టోర్.. ఐట్యూన్లలో డొనేట్ బటన్ ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించింది. ఈ బటన్ ద్వారా యూజర్లు తమ క్రెడిట్.. డెబిట్ కార్డుల ద్వారా కేరళకు సహాయం చేసే వీలుందని పేర్కొంది. కేరళకు జరిగిన భారీ నష్టంపై ఇప్పటికే జాతీయ స్థాయిలోనే కాదు.. వివిధ దేశాలకు చెందిన పలువురు తమకు తోచిన సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.