కొత్త పరిశోధన: ఆపిల్ రాత్రి తింటే మంచిది కాదట..

Update: 2020-09-06 02:30 GMT
రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లక్కర్లేదని చెబుతుంటారు. అలాంటి ఆరోగ్యకరమైన పండు గురించి తాజా పరిశోధన షాకింగ్ గా మారింది. ఆపిల్ రాత్రి తినడం అంత మంచిది కాదని పరిశోధనలో తేలింది.

యాపిల్‌లో పోషకాలే కాదు.. యాసిడ్స్ కూడా ఉంటాయంట. రాత్రి వేళ యాపిల్ తిన్నట్లయితే కడుపులో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై భారం పడేలా చేస్తుంది. పెక్టిన్ వల్ల ఎసిడిటీ కూడా ఏర్పడుతుంది. అందుకే.. యాపిల్‌ను ఉదయం టిఫిన్ తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఇక అరటి పండు తింటే రోగ శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది. అరటి పండులోని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్సర్ సమస్యలను సైతం అరటి పండు దూరం చేస్తుంది. కానీ రాత్రిపూట తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడి జలుబుకు దారితీస్తుందట. ఈ వైరస్ సీజన్లలో జలుబు చేస్తే అంత సులభంగా తగ్గదు.

అంతేకాదు.. అరటి పండును పరగడుపున కూడా తీసుకోకూడదు. ఎందుకంటే.. ఇందులో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా, అంతే త్వరగా అలసటకు గురిచేస్తాయి. అరటి పండిలోని ఆమ్లతత్త్వం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తవచ్చు. మధ్యాహ్నం పూట తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.




Tags:    

Similar News