సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో కేజ్రీవాల్ మాట‌ల ఫైరింగ్‌

Update: 2016-01-21 09:20 GMT
సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌ డీ విద్యార్థి రోహిత్ ఆత్మ‌హ‌త్య ఉదంతం రోజురోజుకీ తీవ్ర‌రూపం దాలుస్తున్న వేళ‌.. జాతీయ స్థాయి నాయ‌కులు ప‌లువురు సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి వ‌స్తున్నారు. గురువారం ఉద‌యం ప‌లువురు ప్ర‌ముఖుల‌తోపాటు.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ వ‌ర్సిటీకి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రోహిత్ ఉదంతంపై విద్యార్థి నేత‌ల‌తో మాట్లాడిన ఆయ‌న అనంత‌రం ఆందోళ‌న చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడారు.

 'జై భీమ్ - రోహిత్ అమర్ రహే - వీ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేసి త‌న ప్ర‌సంగాన్ని కేజ్రీ షురూ చేశారు. బీజేపీ నేత‌ల‌పైనా.. మోడీ స‌ర్కారుపైనా నిప్పులు చెరిగారు. ఆందోళ‌న చేస్తున్న విద్యార్థి యూనియ‌న్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఏఎస్ ఏ విద్యార్థుల త‌ప్పు ఏ మాత్రం లేద‌ని తేల్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగంలోని అంశాలు చూస్తే..

=  ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ పైన ఏఎస్ ఏ విద్యార్థులు దాడి చేయలేదు.
=  ఏబీవీపీ నేతల వేధింపులతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు.
=  కేంద్రమంత్రి  దత్తాత్రేయ ఎలాంటి విచారణ జరపకుండానే విద్యార్థులకు వ్యతిరేకంగా లేఖ రాశారు.
=  ఏఎస్ ఏ జాతి వ్యతిరేక సంస్థ కాదు.
=  యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏఎస్ ఏ విద్యార్థుల తప్పులేదని చెప్పారు.
=  రిజిస్ట్రార్ మాట‌ల్ని ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు?
=  కేంద్ర‌మంత్రి దత్తాత్రేయ లేఖతోనే విద్యార్థులను సస్పెండ్ చేశారు.
=  హెచ్చార్డీ నుంచి వచ్చిన లేఖతో వీసీ మారిపోయారు. కొత్తగా వచ్చిన వీసీ విద్యార్థుల పైన చర్యలు తీసుకున్నారు.
=  వీసీని స‌స్పెండ్ చేయాలి.
=  ఏబీవీపీ.. ఆర్ ఎస్ ఎస్ వాళ్ల‌ను వ‌ర్సిటీల్లో వీసీలుగా బీజేపీ స‌ర్కారు పెడుతోంది.
=  రోహిత్ తన మెరిట్‌తో యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్నాడు.
= రిజర్వేషన్లతో రోహిత్ యూనివర్సిటీకి రాలేదు.
=  అలాంటి మెరిట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానం.
=  విశ్వ‌విద్యాల‌యాల్లో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం మంచిది కాదు.
=  ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ ఆపరేషన్‌ కు ఏఎస్ ఏ విద్యార్థులతో గొడవకు ఏమాత్రం సంబంధం లేదు.
=  విశ్వవిద్యాలయాల్లో కులాల వారీగా చీలిక తెచ్చేందుకు ఏబీవీపీ ప్రయత్నాలు చేస్తోంది,
=  స్మృతి ఇరానీ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి . ఏ విద్యార్థికీ అన్యాయం జరగకుండా ఆమె చూసుకోవాలి.
=  స్మృతి ఇరానీ ఈ వివాదాన్ని దళితులకు.. ఇతర వర్గాలకు మధ్య వివాదంగా చిత్రీకరించారు.
=  ఈ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుదారి పట్టించినందుకు స్మృతి ఇరానీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.
=  కేంద్ర‌మంత్రులు స్మృతి ఇరానీ.. బండారు ద‌త్తాత్రేయ‌ల‌ను ప‌ద‌వుల నుంచి త‌ప్పించాలి.
=  ప్ర‌ధాని మోడీ మీద దేశంలోని విద్యార్థులు ఆగ్ర‌హంగా ఉన్నారు.
=  మోడీ విద్యార్థుల‌తో పెట్టుకోకుండా ఉండ‌టం మంచిది.
=  రోహిత్ ఆత్మ‌హ‌త్య బాధితుల్ని వెంట‌నే అరెస్ట్ చేయాలి.
=  కేంద్రం నుంచి వ‌చ్చిన లేఖ‌ల‌తో పాటు ఢిల్లీ నుంచి వ‌చ్చిన కాల్ రికార్డును బ‌య‌ట‌కు తీయాలి.
=  ఈ ఘ‌ట‌న‌లో బాధ్య‌త ఉన్న వారంద‌రినీ అరెస్ట్ చేయాలి.
Tags:    

Similar News