తెలుగుదేశం పార్టీకి తాజాగా వెలువడిన వరంగల్ - ఖమ్మం పురపాలిక - అచ్చంపేట నగర పంచాయతీల్లో ఓటమి భారాన్ని జీర్ణించుకునే సమయంలో మరో షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ - మాగంటి గోపీనాథ్ గులాబీ గూటికి చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్న సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.
తమను కూడా టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని స్పీకర్ మధుసూదనా చారికి లేఖ రాశారు. పార్టీలో చేరకముందే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల కీలక నిర్ణయం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యే లు కారేక్కేయటంతో గ్రేటర్ లో టీడీపీ ఖాళీ అయినట్లయింది. టీడీపీ నుంచి ఎల్పీనగర్ ఎమ్మెల్యే గా గెలిచిన ఆర్.కృష్ణయ్య గత కొద్ది నెలలుగా పార్టీ కార్యక్రమాలకు కృష్ణయ్య దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.